ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CPI, CPM.. కేసీఆర్ పచ్చి అవకాశవాది: లెఫ్ట్ పార్టీలు

ABN, First Publish Date - 2023-08-23T11:17:24+05:30

హైదరాబాద్: వామపక్షాలు తీవ్రస్థాయిలో బీఆర్ఎస్‌పై విరుచుకుపడుతున్నాయి. సీపీఐ, సీపీఎం నేతలు సీఎం కేసీఆర్‌పై కన్నెర్ర చేశారు. ముఖ్యమంత్రి పచ్చి అవకాశవాదని, నమ్మించి నట్టేట ముంచేశారని, నమ్మకద్రోహి అని విరుచుకుపడ్డారు.

హైదరాబాద్: వామపక్షాలు (Left Parties) తీవ్రస్థాయిలో బీఆర్ఎస్‌ (BRS)పై విరుచుకుపడుతున్నాయి. సీపీఐ (CPI), సీపీఎం (CPM) నేతలు సీఎం కేసీఆర్‌ (CM KCR)పై కన్నెర్ర చేశారు. ముఖ్యమంత్రి పచ్చి అవకాశవాదని, నమ్మించి నట్టేట ముంచేశారని, నమ్మకద్రోహి అని విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో బీఆర్ఎస్ మైత్రి ఉంటుందన్న అంచనాలకు సీఎం కేసీఆర్ తెరదించుతూ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై కామ్రేడ్లలో ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి. కేసీఆర్ పచ్చి రాజకీయ అవకాశవాది అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో తమ వల్ల లబ్ది పొందిన సీఎం కేసీఆర్.. బీజేపీతో ప్రమాదం నుంచి గట్టెక్కి తమపై లెక్కలేని తనాన్ని ప్రదర్శించారని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. పొత్తు చర్చల్లో భాగంగా వామపక్షాలకు కేవలం చెరో ఎమ్మెల్యే సీటు కేటాయిస్తామంటూ ప్రతిపాదనలు పంపి ఇప్పుడు ఏక పక్షంగా తాము ఆశించే సీట్లలో అభ్యర్థులను ప్రకటించి మిత్ర ధర్మాన్ని మరిచారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ సోమవారం 115 స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. అందులో వామపక్షాలు పోటీ చేయాలనుకున్న సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇలా దోస్తీకి కటీఫ్ చెప్పడంతో భవిష్యత్ కార్యాచరణపై సీసీఐ, సీపీఎం మంగళవారం వేర్వేరుగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహంచారు. కేసీఆర్ ఏకపక్ష, నిరంకుశ వైఖరిని వారు తప్పుపట్టారు. బీజేపీతో బీఆర్ఎస్‌కు రాజకీయ సఖ్యత ఉందని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా మునుగోడు నుంచి ఢిల్లీ వరకు కలిసి పనిచేద్దామని గతంలో చెప్పిన కేసీఆర్.. అకస్మాత్తుగా తన రాజకీయ వైఖరిలో వచ్చిన మార్పుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-08-23T11:17:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising