ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ప్రమాదకరంగా మూసారాంబాగ్ బ్రిడ్జి.. రాకపోకలు నిలిచిపోనున్నాయా?

ABN, First Publish Date - 2023-07-26T10:14:18+05:30

ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు భాగ్యనగర వాసులను అతలాకుతలం చేస్తున్నాయి.

హైదరాబాద్: ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు భాగ్యనగర వాసులను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో ప్రజా జీవనం స్తంభించింది. ఎక్కడిక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో హైదరాబాదీలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరోవైపు నగరంలోని మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే బ్రిడ్జికి ఆనుకొని మూసి వరద ప్రవహిస్తోంది. హిమాయత్‌సాగర్ నుంచి నీళ్ళు వదలడంతో మూసీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇవాళ, రేపు భారీ వర్షాలు అంటూ ఇప్పటికే వాతావరణ‌శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం బ్రిడ్జిపై నుండి వాహనాలు రాకపోకలు కొనసాగుతున్నాయి. అయితే నీటి ప్రవాహం పెరిగితే వాహనాలు రాకపోకలను నిషేధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


పోటెత్తిన వరద

మరోవైపు జంట జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్‌కు 1700 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వచ్చిచేరుతోంది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు ప్రస్తుత నీటిమట్టం 1787.10 అడుగులుకు చేరింది. హిమాయత్‌సాగర్‌ ఇన్ ఫ్లో 1500  క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1761.75 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 1761.50 అడుగులకు చేరింది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు హిమాయత్ సాగర్ నాలుగు గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2750 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు.

Updated Date - 2023-07-26T10:19:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising