ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DGP Ravi Gupta: వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీపీ రవి గుప్తా

ABN, Publish Date - Dec 29 , 2023 | 01:02 PM

హైదరాబాద్: తెలంగాణా డీజీపీ రవి గుప్తా శుక్రవారం ఉదయం వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని, పోలీసులు, మీడియా సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామన్నారు.

హైదరాబాద్: తెలంగాణా డీజీపీ రవి గుప్తా శుక్రవారం ఉదయం వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని, పోలీసులు, మీడియా సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే 8.97 శాతం రాష్ట్ర వ్యాప్తంగా క్రైమ్ రేట్ పెరిగిందని, ఈ ఏడాది 2,13,121 కేసులు నమోదు చేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు 17. 59 శాతం పెరిగాయన్నారు.

ఈ ఏడాది జీరో ఎఫ్ఐఆర్‌లు 1108 నమోదు చేశామని, ఐపీసీ సెక్షన్ కింద 1,38,312 కేసులు నమోదు చేసినట్లు డీజీపీ రవి గుప్తా వెల్లడించారు. 73 రేప్ కేసుల్లో 84 మందికి జీవిత ఖైదీ శిక్షలు పడ్డాయని, ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1,360 డ్రగ్ కేసులు ఎన్డీపీఎస్ కింద నమోదు చేశామని, గత ఏడాదితో పొలిస్తే ఈ ఏడాది 15.6 శాతం డ్రగ్స్ కేసులు పెరిగాయన్నారు. 2,52,60 కేజీల గంజాయి, 1240 గంజాయి మొక్కలను సీజ్ చేసి.. 2583 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ కేసులు 1877 నమోదు చేశామని, డ్రగ్స్‌పై తెలంగాణ పోలీస్ కఠినంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వ ఆదేశాలతో డ్రగ్స్ పటిష్ట నిఘా కొనసాగుతోందని డీజీపీ స్పష్టం చేశారు.

డ్రగ్స్ నియంత్రణకు యాంటి నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేశామని, 59 డ్రగ్స్ కేసుల్లో 182 మందిని అరెస్ట్ చేశామని డీజీపీ రవిగుప్తా తెలిపారు. 175 మంది రిపీటెడ్ డ్రగ్ ఫెడ్లర్స్‌పై పిడి యాక్ట్ నమోదు చేశామని, 12 మంది ఫారెన్ అఫెండర్స్‌ను అరెస్ట్ చేశామని, 536 మంది డ్రగ్స్ కంజూమర్స్‌కు కౌన్సెలింగ్ ఇచ్చామని డీజీపీ తెలిపారు.

Updated Date - Dec 29 , 2023 | 01:02 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising