ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: బాలానగర్‌లో డ్రగ్స్ కలకలం

ABN, First Publish Date - 2023-08-29T20:51:43+05:30

నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

హైదరాబాద్‌: నగరంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్(Balanagar) పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నాడు బాలానగర్ శోభన కాలనీ కూరగాయల మార్కెట్లో నల్లమందు(ఓపియం) డ్రగ్ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న రాజ్పూరి(25) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గరి నుంచి 500 గ్రాముల బరువున్న ఐదు నల్లమందు ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్‌లోని మనోహర్ లాల్ అనే వ్యక్తి నుంచి నల్లమందు కొనుగోలు చేసి నగరంలో విక్రయించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మాటు వేసి పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని చెప్పారు. డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మత్తు పదార్థలకు దూరంగా ఉండాలని బాలానగర్‌ పోలీసులు సూచించారు.

Updated Date - 2023-08-29T20:58:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising