ESI Scam: ఈఎస్ఐ స్కామ్‌లో చార్జిషీట్ దాఖలు
ABN, First Publish Date - 2023-08-25T10:32:30+05:30
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్‌లో ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈఎస్‌ఐలో దాదాపు రూ.211 కోట్ల స్కాం జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. ఏసీబీ నమోదు చేసిన ఎనిమిది ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది.
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్‌లో (ESI Scam) ఈడీ చార్జిషీట్ (ED Charge Sheet) దాఖలు చేసింది. ఈఎస్‌ఐలో దాదాపు రూ.211 కోట్ల స్కాం జరిగినట్లు ఈడీ నిర్ధారించింది. ఏసీబీ నమోదు చేసిన ఎనిమిది ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది. ఈ కేసులో దేవికారాణితో పాటు 15 మందిపై ఈడీ అభియోగాలు మోపింది. మెడికల్ పరికరాల కొనుగోలు పేరుతో అక్రమాలు జరిగినట్లుగా నిర్థారించింది. ఇప్పటికే 144 కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అటాచ్ చేసింది. సర్జికల్ కిట్స్‌తో పాటు మందుల సప్లై పేరుతో నిందితులు అక్రమాలకు పాల్పడ్డారు. ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికరాణి (Devikarani is the former director of IMS) నకిలీ ఇన్ వాయిస్ సృష్టించి పెద్ద మొత్తంలో లబ్ధి పొందారు. మెడికల్ క్యాంపుల పేరుతోనూ నిధుల గోల్‌మాల్‌కు పాల్పడ్డారు. అక్రమ సంపాదనతో 6 కోట్ల విలువ చేసే బంగారాన్ని దేవికరాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మి కొనుగోలు చేశారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్లోనూ నిందితులు పెట్టుబడులు పెట్టారు. డబ్బును జమ చేసేందుకు పలు షల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ షాపులను ఈడీ ఇప్పటికే అటాచ్ చేసింది. దేవిక రాణీతో పాటు ఏడుగురు ఉద్యోగుల పాత్రపై ఈడీ ప్రస్తావించింది.
Updated Date - 2023-08-25T10:32:30+05:30 IST