ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ED Raids: తెలంగాణ వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు

ABN, First Publish Date - 2023-06-22T10:49:49+05:30

రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మెడికల్ కళాశాలలపై ఈడీ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో కేసు నమోదు అయ్యింది. వరంగల్ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు (ED Raids) కొనసాగుతున్నాయి. మెడికల్ కళాశాలలపై ఈడీ సోదాలు ఇంకా జరుగుతున్నాయి. పీజీ మెడికల్ సీట్లు అక్రమంగా బ్లాక్ చేశారన్న అభియోగంపై ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో కేసు నమోదు అయ్యింది. వరంగల్ పోలీసుల కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్రంలో పది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 45 సీట్లు బ్లాక్ చేసి తర్వాత అమ్ముకున్నారని అభియోగాలు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని తొమ్మిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. 20 ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డిలలో ఈడీ సోదాలు చేపట్టింది. ఓవైసీ హాస్పటల్‌లో సోదాలు జరుగుతున్నాయి. అలాగే పలు మెడికల్ కాలేజీలలో సోదాలు ముగియగా.. మరికొన్ని చోట్ల రెండవ రోజు ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు ఈడీ సోదాలు జరగనున్నాయి.

Updated Date - 2023-06-22T10:49:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising