ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Etala Rajender: సీఎం‎కు పోయే కాలం వచ్చింది.. నోటీసులకు, జైళ్లకు భయపడను..

ABN, First Publish Date - 2023-04-07T13:36:00+05:30

నేను టెక్నాలజీకి అప్ డేట్ కాలేదు.. మేసేజ్ లకు రిప్లై ఇవ్వను..ఎవరో ఒక వ్యక్తి వాట్సాప్ చేస్తే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: పోలీసులు ఇచ్చిన నోటీసులపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను టెక్నాలజీకి అప్ డేట్ కాలేదు.. మేసేజ్ లకు రిప్లై ఇవ్వను..ఎవరో ఒక వ్యక్తి వాట్సాప్ చేస్తే.. అది చూడకపోయినా.. నాకు నోటీసులు ఇచ్చారు. వేధించడానికే నోటీసులు ఇచ్చారు. నోటీసులకు, జైళ్లకు భయపడము. సంబంధం లేకపోయిప్పటికీ నోటీసు ఇవ్వడాన్ని ఖండిస్తున్నాను. చట్టం మీద గౌరవం ఉంది. నోటీసులపై వివరణ ఇస్తా. సీఎం కేసీఆర్‎కు పోయే కాలం వచ్చింది. పోలీసులను నమ్ముకున్నోళ్లు బాగుపడరు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు’’ అని ఈటల ధ్వజమెత్తారు.

కాగా,..ఇదే సమావేశంలో సింగరేణి కార్మికుల విషయంపై మాట్లాడారు. ‘‘సింగరేణి ఎందుకు రూ.10వేల కోట్లు అప్పుల పాలైంది.? తెలంగాణ వచ్చేనాటికి 63 వేల మంది ఉద్యోగులతో కళకళలాడిని సింగరేణి.. ఇప్పుడు 43 వేల మంది ఉద్యోగులకు పడిపోయింది. సింగరేణి పెరిగిందా? తగ్గిందా ?.. 55 మిలియన్ టన్నుల నుంచి 65 మిలియన్ టన్నులకు బొగ్గు ఉత్పత్తి పెరిగింది. బొగ్గు ఉత్పత్తి పెరిగింది..కానీ ఉద్యోగులు తగ్గారు..90 శాతం పనులు ప్రైవేటు కార్మికులకు అప్పగిస్తున్నారు. కోల్ ఇండియాలో ఒక్కో కార్మికుడికి 900లకు పైగా ఇస్తున్నారు. సింగరేణి కార్మికుడికి రూ.430లు మాత్రమే ఇచ్చి.. శ్రమదోపిడి చేస్తున్నారు. సింగరేణి కంపెనీని ఏఎంఆర్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. దాని వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసు. సీఎం కేసీఆర్ అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని’’ తీవ్రస్థాయిలో ఈటల రాజేందర్ మండిపడ్డారు.

Updated Date - 2023-04-07T13:55:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising