ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Etela : అసెంబ్లీ స్పీకర్ సహా కేసీఆర్, కేటీఆర్‌లపై పెద్ద ఎత్తున ఈటల ఫైర్..

ABN, First Publish Date - 2023-08-08T13:24:23+05:30

అసెంబ్లీ స్పీకర్‌ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు. అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ గొప్పగా నిర్వహించాడంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు కనీసం రూమ్ కూడా ఇవ్వకపోతే గన్ మెన్స్ రూమ్‌లో కూర్చొని నోట్స్ రాసుకున్నామన్నారు.

హైదరాబాద్ : అసెంబ్లీ స్పీకర్‌ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సెటైర్లు వేశారు. అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ గొప్పగా నిర్వహించాడంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలకు కనీసం రూమ్ కూడా ఇవ్వకపోతే గన్ మెన్స్ రూమ్‌లో కూర్చొని నోట్స్ రాసుకున్నామన్నారు. సీఎం కేసీఆర్‌కు చట్ట సభల మీద విశ్వాసం సన్నగిలిందనడానికి నిదర్శనం ఇటీవల జరిగిన సమావేశాలేనన్నారు. ఒక సంవత్సరం లో అసెంబ్లీ సమావేశాలు జరిగింది కేవలం 14 రోజులేనని.. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి దాదాపు 50 నుంచి 65 రోజులు సమావేశాలు జరిగేవని ఈటల అన్నారు.

‘‘ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకుంది చట్టాలు చేసేందుకు.. కానీ ఎమ్మెల్యేలను విమర్శలు చేసే వారిని బెదిరించే వారిగా తయారు చేశారు. ఎన్ని రోజులు అయినా చర్చకు సిద్ధం అని చెప్పే ముఖ్యమంత్రి ఎందుకు ఇలా వ్యహహారిస్తున్నారు? ఉమ్మడి రాష్ట్రంలో13 పార్టీలు ఉన్న బీఏసీకి పిలిచేవారు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో ఉంది కేవలం నాలుగు పార్టీలే.. అందులో బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ. ఇలాంటి పార్టీని బీఏసీకి పిలవకపోవడం అంటే ఎంత అక్కసు ఉందో తెలుసుకోవచ్చు. బీజేపీకి అసెంబ్లీలో కనీసం రూమ్ కూడా ఇవ్వలేదు. మమ్మల్ని అవమాన పర్చడం కాదు.. స్పీకర్ మా హక్కులను కాపాడండి అని ఆడిగినం.

శాసనసభలో ఎమ్మెల్యే కు కన్వెన్షన్ ఉంటాయి.. వాటిని ఎక్కడా స్పీకర్ పాటించలేదు.. అసెంబ్లీలో మేము ఏమైనా చెప్పాలి అనుకుంటే ఆయన కనీసం మా మొహం కూడా చూడడు. అసెంబ్లీలో కేవలం సీఎం వైపు మాత్రమే చూస్తూ మాకు సమయం కూడా ఇవ్వడు. బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రులే అని సీఎం చెబుతాడు. మిత్ర పక్షమే అసెంబ్లీలో ప్రతిపక్షంగా వ్యహరించడం దారుణం. అసెంబ్లీలో ఎన్ని ప్రశ్నలు అడిగినా ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేదు. ఎంఐఎం అడిగితే మాత్రం లేచి లేచి సమాధానాలు చెప్పారు. వరదల్లో 41 మంది చనిపోతే అసెంబ్లీలో వారి ప్రస్తావనే లేదు.. కనీసం వారికి సంతాపం కూడా లేదు.

వరదల్లో నష్టపోయిన రైతులకు కనీస సహాయం లేదు. ఏం చేయకపోయినా మళ్ళీ 105 సీట్ల తో గెలుస్తాం అని చెపుతున్నారంటే రైతుల పట్ల వారికి ఉన్న కన్సర్న్ ఏంటో తెలుస్తుంది. హరీష్ రావు మాట్లాడితే అన్నింటిలో తెలంగాణ నంబర్ 1. కేటీఆర్ మాట్లాడితే చప్పట్లు కొట్టే వారు 100 ఎమ్మెల్యేలు ఉన్నారు అని ర్యాగింగ్ చేయడమే. కాగ్ రిపోర్ట్ లో ప్రభుత్వం అనేక తప్పులను ఎత్తి చూపింది. బడ్జెట్ అలకేషన్స్ ఉన్నాయి కానీ రిలీజ్ చేసేది లేదని ఎత్తి చూపింది. పెట్టే బడ్జెట్ కొండంత.. ఖర్చు చేసేది గోరంత అని కాగ్ రిపోర్టు చెప్పింది. కానీ కేసీఆర్ మాత్రం నా అమ్ముల పొదిలో అనేక అస్త్రాలు ఉన్నాయి అంటున్నాడు. గతంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ లాంటి హామీలే ఇప్పటికి అమలు కాలేదు.’’ అని ఈటల పేర్కొన్నారు.

Updated Date - 2023-08-08T13:24:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising