ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: మోకిల భూముల వేలంలో ఘరానా మోసం

ABN, First Publish Date - 2023-09-12T15:59:41+05:30

మోకిల భూముల వేలంలో ఘరానా మోసం వెలుగుచూసింది. ధరల పెంచేందుకు బిడ్డర్లు ఎక్కువ వేలం పాట పాడి వదిలేశారు. చుట్టుపక్కల ఉన్న వెంచర్లకు హైప్ క్రియేట్ చేసేందుకు ఇలా చేసి ఉంటారని అనుమానాలు

హైదరాబాద్: మోకిల భూముల వేలంలో ఘరానా మోసం వెలుగుచూసింది. ధరల పెంచేందుకు బిడ్డర్లు ఎక్కువ వేలం పాట పాడి వదిలేశారు. చుట్టుపక్కల ఉన్న వెంచర్లకు హైప్ క్రియేట్ చేసేందుకు ఇలా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిపాజిటర్లు వివరాలను హెచ్ఎండీఏ వెల్లడించలేదు. వేలంలో డబ్బులు కట్టని 10 మందిని హెచ్ఎండీఏ బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. ధరావతుగా కట్టిన లక్ష రూపాయలను మాత్రం జమ చేసుకుంది. ధరావతు లక్ష రూపాయలే కావడంతో పోయినా పర్లేదు అని 'రియల్' గేమ్స్ ఆడి ఉంటారని సందేహం వ్యక్తమవుతోంది.

మోకిల ఫేజ్-1 లో అత్యధికంగా లక్షా 5 వేలు పలకడంపై గతంలోనే అనుమానాలు చోటుచేసుకున్నాయి. 60 వేల నుంచి హఠాత్తుగా లక్షకు పెంచారని బిడ్డింగ్‌లో పాల్గొన్న పలువురు అంటున్నారు. మోకిలలో అత్యధికంగా రూ.60-70 వేలు మాత్రమే మార్కెట్ ధర ఉంటుందని స్థానికులు స్థానికులు చెబుతున్నారు. హెచ్ఎండీఏ వేలంలో లక్షలు చూపించడంతో చుట్టుపక్కల భూములు రేట్లు అమాంతం పెరిగాయని స్థానికులు అంటున్నారు. ఫేజ్-2 వేలంలోనూ అత్యధికంగా లక్ష రూపాయలు చదరపు గజం పలికింది. దాని ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇంకా అందలేదని సమాచారం. గడువులోగా పేమేంట్ చేయాలని ఫేజ్-2 వేలంలో దక్కించుకున్న వారికి హెచ్ఎండీఏ ఆదేశించింది. 300 ప్లాట్ల వేలంలో ఎంతమంది డిపాల్టర్లు ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది.

Updated Date - 2023-09-12T15:59:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising