ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fire DG Nagireddy: స్వప్నలోక్ భవనంలో ఫైర్ సేఫ్టీ పెట్టారు.. కానీ...

ABN, First Publish Date - 2023-03-17T11:18:14+05:30

సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ఫైర్ డీజీ నాగిరెడ్డి స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌ (swapnalok Complex Fire Accident) లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై ఫైర్ డీజీ నాగిరెడ్డి (Fire DG Nagireddy స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... గురువారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో స్వప్నలోక్ అగ్నిప్రమాదంపై తమకు సమాచారం అందిందని తెలిపారు. ఈ అగ్నిప్రమాదంలో బిల్డింగ్ లోపల చిక్కుకు పోయిన 12 మందిని రక్షించామని.. అయితే దురదృష్టవశాత్తు ఆరుగురు చనిపోయారన్నారు. ఈ అగ్నిప్రమాదానికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ షాక్ అనే భావిస్తున్నామని అన్నారు. బిల్డింగ్‌లో ఫైర్ సేఫ్టీ పెట్టారు కానీ అవి ఏమాత్రం పని చేయడం లేదన్నారు. బిల్డింగ్‌లో సెట్ బ్యాక్స్ అనుకూలంగా ఉన్న కారణంగా ఫైర్ ఫైటింగ్ ఈజీగా చేయగలిగామని ఫైర్ డీజీ చెప్పారు.

స్వప్నలోక్ బిల్డింగ్ యజమానులకు ఫైర్ సేఫ్టీ పెట్టుకోమని చెప్పామని అయినప్పటికీ నిర్లక్ష్యంగా చేశారన్నారు. అగ్నిప్రమాదం కారణంగా 5, 7 అంతస్తుల్లో ఉన్న షాపులు డ్యామేజ్ అయ్యాయని తెలిపారు. ఈ ఘటనలో షాపు కీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బిల్డింగ్ పరిస్థితి బాగానే ఉందని... ఫైర్ ఫైటింగ్ సిస్టం ప్రతి కమర్షియల్‌లో తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఫైర్ సేఫ్టీ పెట్టుకుంటే సరిపోదు వాటి మెయింటెనెన్స్ సరిగా ఉంచుకోవాలని సూచించారు. ప్రధానంగా కమర్షియల్ కాంప్లెక్స్‌లు లాక్ చేయకూడదన్నారు. చనిపోయిన వారు ఉన్న ప్రాంతంలో తాళాలు వేసి ఉండటంతో వారు బయట పడలేక పోయారని తెలిపారు. వ్యాపారా లావాదేవీలు నిర్వహించే వారు మెయింటేన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించకూడదని డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు.

కాగా... సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిప్రమాదం కారణంగా చుట్టుముట్టిన పొగను పీల్చి అపస్మారక స్థితికి చేరుకున్న ఆరుగురినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వారి పరిస్థితి విషమించడంతో వైద్యులు చికిత్స అందించినప్పటికీ మృత్యువాతపడ్డారు. స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లోని ఎనిమిదో అంతస్తులో మొదలైన మంటలు 7, 6, 5 అంతస్తులకు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపు మూడు గంటలపాటు మంటలు తగ్గినట్టే తగ్గి మళ్లీ వ్యాపిస్తుండడంతో అప్రమత్తమైన అగ్నిమాపక అధికారులు.. అదనపు ఫైరింజన్లను రప్పించారు. మొత్తం 15 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.

Updated Date - 2023-03-17T11:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising