ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Prakash Ambedkar: ప్రగతిభవన్‌కు ప్రకాష్ అంబేడ్కర్.. కేసీఆర్ సాదర స్వాగతం

ABN, First Publish Date - 2023-04-14T15:28:22+05:30

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనమడు, మాజీ లోక్‌సభ సభ్యులు ప్రకాష్ అంబేద్కర్ కాసేపటి క్రితమే ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనమడు, మాజీ లోక్‌సభ సభ్యులు ప్రకాష్ అంబేద్కర్ (Grandson of Dr. BR Ambedkar, former Lok Sabha member Prakash Ambedkar) కాసేపటి క్రితమే ప్రగతిభవన్‌కు చేరుకున్నారు. ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సాదరంగా ఆహ్వానించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఆవిష్కరిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల అంబేడ్కర్‌ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రకాష్ అంబేడ్కర్ గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ప్రగతిభవన్‌కు చేరుకున్న ఆయనకు సీఎం ఆహ్వానం పలికారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రకాష్‌తో కేసీఆర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. మధ్యాహ్నం భోజనంతో ప్రకాష్‌కు కేసీఆర్ (Telangana CM) అతిథ్యమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, విప్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్, పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, శంకర్ అన్న ధోంగే, సిద్దోజీరావు తదితరులు పాల్గొన్నారు. మరికాసేపట్లో ప్రకాష్ అంబేడ్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్.. డా. బీఆర్ అంబేడ్కర్ మహా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లనున్నారు. అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ అనంతరం నూతన సచివాలయాన్ని ప్రకాష్ అంబేడ్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. నూతన సెక్రెటరియేట్ నిర్మాణ పనులు, ప్రత్యేకతలను ప్రకాష్ అంబేడ్కర్‌కు కేసీఆర్ వివరించనున్నారు.

Updated Date - 2023-04-14T16:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising