కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Babu Mohan: టికెట్ ఇవ్వని బీజేపీ.. త్వరలో రాజీనామా యోచనలో బాబూ మోహన్?

ABN, First Publish Date - 2023-10-28T14:12:52+05:30

బీజేపీ టికెట్ విషయంలో గత రోజులుగా వస్తున్న వార్తలపై సీనీనటుడు, మాజీ మంత్రి బాబు మోహన్‌ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తన మీద మీడియాలో, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు మోహన్‌కు టికెట్ వస్తుందో రాదో తరువాత విషయమని.. కొడుకుకు వస్తుంది, తండ్రి తండ్రికి రాదు అంటూ వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Babu Mohan: టికెట్ ఇవ్వని బీజేపీ.. త్వరలో రాజీనామా యోచనలో బాబూ మోహన్?

హైదరాబాద్: బీజేపీ (BJP) టికెట్ విషయంలో గత రోజులుగా వస్తున్న వార్తల పట్ల సీనీనటుడు, మాజీ మంత్రి బాబు మోహన్‌ (Former Minister Babu Mohan) స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తనపై మీడియాలో, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు మోహన్‌కు టికెట్ వస్తుందో రాదో తరువాత విషయమని.. కొడుకుకు వస్తుంది, తండ్రికి రాదు అంటూ వార్తలు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రీ, కొడుకుల మధ్య యుద్ధం అని రాస్తున్నారన్నారు. బీజేపీ అధిష్టానం తప్పు ఉందని.. ఈ మొదటి లిస్ట్ ఏంటో, రెండో లిస్ట్ ఏంటో తనకు తెలియదన్నారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల‌లో తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి ప్రకటించారు.


కాల్ చేస్తే లిఫ్ట్ చేయరే?..

‘‘నా కొడుకుకు ఇస్తారో, మరొకరికి టికెట్ ఇస్తారో మీ ఇష్టం.. కనీసం ఈ విషయం నాకు సమాచారం ఇవ్వాల్సి ఉండే.. పార్టీకి దూరంగా ఉంటాను, ప్రచారానికి దూరంగా ఉంటాను. బీజేపీ నేతలు రెస్పాండ్ అయ్యే దానిని బట్టి నేను పార్టీలో ఉండాలో లేదో ఆధారపడి ఉంటుంది. నేను రాజీనామా చేసే పరిస్థితి వస్తే నాకు అనేక అవమానాలు జరిగాయి.. వాటిని అన్నింటినీ చెబుతాను. కనీసం నేను ఫోన్ చేస్తే కిషన్ రెడ్డి, బండి సంజయ్ లిఫ్టు చేయకపోతే ఎలా? ’’ అని బాబు మోహన్ ప్రశ్నించారు.


మొత్తానికి మీడియా సమావేశంలో బాబు మోహన్ చేసిన వ్యాఖ్యలను చూస్తే త్వరలోనే ఆయన బీజేపీకి టాటా చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి మున్ముందు రాజీనామా, భవిష్యత్ కార్యాచరణపై బాబు మోహన్ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడనుందో అని ఆయన అభిమానులు, కార్యకర్తలు వేచి చూస్తున్నారు.

Updated Date - 2023-10-28T14:30:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising