Syber Crime: తెలివిమీరిన సైబర్ నేరగాళ్లు.. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలు..
ABN, First Publish Date - 2023-11-24T11:59:36+05:30
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు తెలివిమీరిపోయారు. ఈజీ మనికి అలవాటు పడి క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలు.. ఇన్వెస్టుమెంట్, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్లు, ఆన్‌లైన్ సర్వీసులు ఇలా రకరకాలుగా మోసాలు చేస్తున్న వారు.. తాజాగా వేలి ముద్రలతో బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు.
హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు తెలివిమీరిపోయారు. ఈజీ మనికి అలవాటు పడి క్రెడిట్, డెబిట్ కార్డు మోసాలు.. ఇన్వెస్టుమెంట్, క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్లు, ఆన్‌లైన్ సర్వీసులు ఇలా రకరకాలుగా మోసాలు చేస్తున్న వారు.. తాజాగా వేలి ముద్రలతో బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. క్లోనింగ్ పద్ధతిలో నకిలీ వేలిముద్రలను తయారు చేస్తున్న ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు ఆట కట్టించారు. నకిలీ ఫింగర్ ప్రింట్స్ ద్వారా నగదు డ్రా చేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు.
సైబర్ కేటుగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతూ పోలీసుల చేతుల్లో కుదేలవుతున్నారు. తాజాగా కొత్త పద్ధతుల్లో నకిలీ ఫింగర్ ప్రింట్ ద్వారా అకౌంట్‌లో ఉన్న నగదును మాయం చేస్తున్నారు. చాలా మంది కొత్త సిమ్ కార్డులు తీసుకునేందుకు, ఆర్థిక లావాదేవీలకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సయితం వేళిముద్రలు వేస్తుంటారు. అయితే ఆ వేలి ముద్రలను సైబర్ నేరగాళ్లు సేకరించి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘటనల్లో కేటుగాళ్లు నాలుగు రోజుల్లో రూ. 10 లక్షల నగదు డ్రా చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-24T11:59:37+05:30 IST