ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ganesh Immersion: గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాల కోసం జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు పూర్తి

ABN, First Publish Date - 2023-09-27T10:45:55+05:30

గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హుస్సేన్‌సాగర్, ప్రధాన చెరువులతో బేబీ పాండ్స్‌లో నిమజ్జన ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్: గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాల కోసం జీహెచ్ఎంసీ (GHMC) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. హుస్సేన్‌సాగర్, ప్రధాన చెరువులతో బేబీ పాండ్స్‌లో నిమజ్జన ఏర్పాట్లు చేశారు. గ్రేటర్‌లో ఈసారి 90 వేల గణేష్ విగ్రహాలను ఏర్పటు అయ్యాయి. ట్యాంక్ బండ్‌లో 30 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో 14 క్రేన్లను ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా పీఓపీ విగ్రహాల కోసం 72 బేబీ పాండ్స్ ఏర్పాటు చేశారు. చెరువుల పక్కన 28 బేబీ పాండ్స్.. వీటిలో 10 నుంచి 12 అడుగుల విగ్రహాల నిమజ్జనం జరుగనుంది. ఒకసారి 60 నుంచి 80 విగ్రహాలు నిమజ్జనం చేసి వ్యర్థాలను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. 24 ప్రాంతాల్లో పోర్టబుల్ బేబీ పాండ్స్ ఏర్పాటు చేశారు. వీటిలో 3 అడుగుల నుంచి 5 అడుగుల ఎత్తు ఉండే విగ్రహాల నిమజ్జనం జరుగనుంది. 23 ప్రాంతాల్లో తాత్కాలిక బేబీ పాండ్స్ నిర్మించగా.. వీటిలో 6 నుండి 8 అడుగుల విగ్రహాల నిమజ్జనం జరుగనుంది. నగరంలోని ప్రధాన రోడ్లలో 354 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర జరుగనుంది. ఈ క్రమంలో రోడ్లపై ఉన్న గుంతలను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం పూడ్చి వేసింది. 354 కిలోమీటర్ల రోడ్లలో నిమజ్జన కేంద్రాల వద్ద ప్రత్యేక లైటింగ్ వ్యవస్థ రూ.2.15 కోట్లతో ఏర్పాటు చేశారు.


శోభాయాత్ర మార్గంలో రోడ్డు సైడ్ ఉన్న చెట్ల కొమ్మలు, మట్టి ఇతర వ్యర్థాలను తొలగించారు. శోభాయాత్ర మార్గంలో పారిశుద్ధ్య పనులకు పదివేల మంది శానిటేషన్ కార్మికులను నియమించారు. పదివేల మంది కార్మికులు, 295 మంది జవాన్లు, 688 మంది ఎస్ఎఫ్ఐలతో 168 టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి. ప్రతి క్రేన్ వద్ద ఇరవై ఒక్క మంది పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు. క్రేన్ల వద్ద పనిచేసేందుకు ప్రత్యేకంగా వెయ్యిమంది ఎంటమాలజీ సిబ్బందిని నియమించారు. 75 ప్రాంతాలతో పాటు హుస్సేన్ సాగర్, సరూర్నగర్ లేక్, కూకట్‌పల్లి చెరువు, కాప్రా, మల్కాజిగిరి చెరువుల వద్ద నిమజ్జనం జరుగనుంది. నిమజ్జన ప్రాంతాల వద్ద డీఆర్ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాల్లుతో భద్రత ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల్లో అవసరమైన స్టేజీల ఏర్పాటు, భారీ కేడింగును ఆర్‌అండ్‌బీ ఏర్పాటు చేసింది. శోభాయాత్ర మార్గాల్లో నిమజ్జన కేంద్రాల వద్ద జలమండలి తాగునీటిని సరఫరా చేయనున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. శోభాయాత్ర మార్గాల్లో రాత్రిళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్ట్రీట్ లైట్ను మెయింటెనెన్స్ చేసేలా ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు.

Updated Date - 2023-09-27T10:45:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising