ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSRTC: టీఎస్ఆర్టీసీ బాలాజీ దర్శన్‌ టికెట్లకు మంచి స్పందన !

ABN, First Publish Date - 2023-02-07T19:38:39+05:30

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) బాలాజీ దర్శన్‌ (Bajali darshan) టికెట్లకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఏడు నెలల్లో 77,200 మంది భక్తులు ఈ టికెట్లను బుక్‌ చేసుకుని.. క్షేమంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఏడు నెలల్లో 77,200 టికెట్ల బుకింగ్‌

  • బస్‌ టికెట్‌తో పాటే శ్రీవారి దర్శన టికెట్‌ పొందే సదుపాయం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) బాలాజీ దర్శన్‌ (Bajali darshan) టికెట్లకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఏడు నెలల్లో 77,200 మంది భక్తులు ఈ టికెట్లను బుక్‌ చేసుకుని.. క్షేమంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. గత ఏడాది జులైలో 3,109, ఆగస్టులో 12,092, సెప్టెంబర్‌లో 11,586, అక్టోబర్‌లో 14,737, నవంబర్‌లో 14,602, డిసెంబర్‌లో 6,890, ఈ ఏడాది జనవరిలో 14,182 మంది బస్‌ టికెట్‌తో పాటు శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్లను బుక్‌ చేసుకున్నారని టీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తుల కోసం గత ఏడాది జులై నుంచి 'బాలాజీ దర్శన్‌'ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది. తిరుమల వెళ్లేందుకు బస్‌ టికెట్‌ బుక్‌ చేసుకునే సమయంలోనే శ్రీవారి శీఘ్ర దర్శన టికెట్‌ను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్టు, అందుకోసం టీటీడీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్టు వివరించింది.

"బాలాజీ దర్శన్‌ టికెట్లకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. ఈ నెలలో శుభకార్యాలు, పెళ్లిళ్లు ఎక్కువగా ఉన్నాయి. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులు టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని యాజమాన్యం కోరుతోంది. ప్రయాణ టికెట్‌తో పాటు శ్రీవారి ప్ర‌త్యేక‌ దర్శన టికెట్‌ను సంస్థ అందిస్తోంది. ఈ టికెట్ తో ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ప్రయాణించి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవచ్చు. బాలాలయ మహా సంప్రోక్షణను టీటీడీ వాయిదా వేసినందున.. ఈ నెల 23 నుంచి మార్చి 1 వరకు బ్లాక్ చేసి ఉన్న‌ శీఘ్ర దర్శన టికెట్లను తిరిగి విడుదల చేయడం జరిగింది. భక్తులు www.tsrtconline.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోగలరు." అని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ గారు, ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారు సూచించారు. బాలాజీ దర్శన్ టికెట్లను కనీసం వారం రోజుల ముందుగా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంద‌ని వారు తెలిపారు.

Updated Date - 2023-02-07T19:39:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising