ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bandi Sanjay : బండి సంజయ్‌ పిటిషన్‌పై విచారణ.. అది లీకేజీ ఎలా అవుతుందన్న హైకోర్టు

ABN, First Publish Date - 2023-04-06T13:34:11+05:30

బండి సంజయ్ లంచ్ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. హనుమకొండ కోర్టు డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులు 41ఏ నోటీస్ ఇవ్వలేదని పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్ : బండి సంజయ్ (Bandi Sanjay) లంచ్ మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు (High Court)లో విచారణ జరిగింది. హనుమకొండ కోర్టు (Hanumakonda Court) డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులు 41ఏ నోటీస్ ఇవ్వలేదని పేర్కొన్నారు. రిమాండ్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సోమవారానికి వాయిదా పడింది. ప్రతివాదులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలోనే బండి సంజయ్‌పై ఉన్న ఆరోపణలు ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. పేపర్‌ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాక లీకేజ్ ఎలా అవుతుందని అడిగింది. లోయర్ కోర్టులో ఉన్న బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు నిర్ణయం తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. బండి సంజయ్‌ బెయిల్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతిచ్చింది. మరికాసేపట్లో బండి సంజయ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

బండి సంజయ్ లంచ్ మోషన్‌లో కీలక అంశాలు..

- హనుమకొండ కోర్ట్ ఇచ్చిన డాకెట్ ఆర్డర్ సస్పెండ్ చేయాలి

- తక్షణమే సంజయ్‌ను విడుదల చేయాలి

- అరెస్ట్ సమయంలో పోలీసులు 41-ఎ నోటీస్ ఇవ్వలేదు

- అరెస్టు సమయంలో పోలీసులు మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు -

- కరీంనగర్ నుండి 150 కిలోమీటర్లు దూరం లో ఉన్న బొమ్మలరామారంకు తరలించారు

- బొమ్మలరామారంకు ఎందుకు తరలించారో తెలియదు.

- ఇదే బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌పై గతంలో నక్సలైట్లు దాడి చేశారు

- రాత్రంతా బొమ్మలరామారం పిఎస్‌లోనే అక్రమంగా నిర్బంధించారు

- వైద్య పరీక్షల కోసం బొమ్మలరామారం నుండి 70 కిలోమీటర్ల లో ఉన్న పాలకుర్తి గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించారు

- పాలకుర్తి నుండి మళ్లీ హన్మకొండకు తరలించారు

- కరీంనగర్ నుండి వరంగల్‌కు కేవలం 60 కిలోమీటర్ల దూరం ఉంది

- వేధింపులకు గురి జేయాలనే కిలోమీటర్ల కొద్ది తిప్పారు

- వరంగల్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారు

- బీజేపీపై కుట్రలో భాగంగానే కేసులో ఇరికించారు

- రిమాండ్ రిపోర్టులో సైతం నేరం చేసినట్టు ఎక్కడ పొందపర్చ లేదు

- అరెస్టు సమయంలో సిఆర్పిసి 50 నిబంధనలను పోలీసులు పాటించలేదు

- పోలీస్ కస్టడీలోనూ దురుసుగా ప్రవర్తించారు

- మొన్న రాత్రి అరెస్టు చేస్తే నిన్న సాయంత్రం 6:02 కు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు

- బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టు పోలీసులు ప్రవర్తిస్తున్నారు

- హనుమకొండ కోర్ట్ ఇచ్చిన డాకెట్ ఆర్డర్‌ను సస్పెండ్ చేయాలి

Updated Date - 2023-04-06T13:45:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising