Revanth Reddy : రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుపై సుప్రీంలో విచారణ
ABN, First Publish Date - 2023-07-20T11:55:23+05:30
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటుకు నోటు వ్యవహారంపై రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది.
ఢిల్లీ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటుకు నోటు వ్యవహారంపై రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది. కొన్ని అనివార్య కారణాల రిత్యా కేసు విచారణ వాయిదా వేయాలని సుప్రీంకోర్టుకు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు లేఖ రాశారు. దీనికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. లేఖ పంపినట్లు తమకు ముందస్తు సమాచారం లేదని కేసు విచారణ వెంటనే చేపట్టాలని తెలంగాణ తరపు న్యాయవాదులు కోరారు. కేసు తీవ్రత దృష్ట్యా విచారణ వాయిదా వేయొద్దని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ బేలా, ఎం త్రివేది ధర్మాసనం దీనిపై విముఖత చూపింది. ఆగస్టు 28న విచారణ జరుపుతామని మరోసారి వాయిదా కోరవద్దని రేవంత్ రెడ్డి న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది.
Updated Date - 2023-07-20T11:55:23+05:30 IST