Shamshabad Airport: వారంతా బంగారాన్ని ఎలా తీసుకెళ్తున్నారో తెలిస్తే అవాక్కవాల్సిందే...

ABN, First Publish Date - 2023-02-23T09:26:55+05:30

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టుబడుతూనే ఉంది.

Shamshabad Airport: వారంతా బంగారాన్ని ఎలా తీసుకెళ్తున్నారో తెలిస్తే అవాక్కవాల్సిందే...
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport) లో బంగారం (Gold) పట్టుబడుతూనే ఉంది. వివిధ దేశాల నుంచి కొందరు ప్రయాణికులు పెద్దమొత్తంలో బంగారాన్ని తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ విఫలమవుతున్నారు. బంగారాన్ని తీసుకువచ్చేందుకు ప్రయాణికులు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. బంగారాన్ని పేస్ట్ రూపంలో, షూ, లగేజ్‌ బ్యాగ్‌, కొందరు ఏకంగా కడుపులో బంగారాన్ని దాచుకుని కస్టమ్స్‌ అధికారుల (Customs Officers) కు చిక్కకుండా వెళ్లేందుకు యత్నించారు. కాగా వీరి ప్రయత్నాలను కస్టమ్స్‌ అధికారులు తిప్పికొడుతున్నారు. నూతన టెక్నాలజీతో బంగారం సరఫరా చేసే వారిని అధికారులు ఈజీగానే పట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సూడన్ నుంచి షార్జా వెళ్లే 23 మంది ప్రయాణికుల నుంచి దాదాపు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ 23 మంది ప్రయాణికులు తమ లగేజ్‌లతో పాటు వారు ధరించిన బూట్లలో బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుకున్న బంగారం విలువ దాదాపు రూ.8 కోట్లు ఉంటుందని అంచనా. ప్రధానంగా నలుగురు ప్రయాణికులను అరెస్ట్ చేసిన కస్టమ్స్ అధికారులు.. బంగారాన్ని ఎక్కడికి చేరవేస్తున్నారనే దానిపై దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-02-23T09:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising