Hero Navdeep: మాదాపూర్ డ్రగ్స్ కేసు.. సమాధానాలు దాటవేస్తున్న హీరో నవదీప్
ABN, First Publish Date - 2023-09-23T13:48:53+05:30
మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. శనివారం ఉదయం హీరో నవదీప్ నార్కోటిక్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. గత రెండు గంటలుగా నవదీప్ విచారణ కొనసాగుతోంది. అయితే విచారణలో నవీదీప్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో (Madapur Drugs Case) పోలీసుల విచారణ కొనసాగుతోంది. శనివారం ఉదయం హీరో నవదీప్ (Hero Navdeep) నార్కోటిక్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. గత రెండు గంటలుగా నవదీప్ విచారణ కొనసాగుతోంది. అయితే విచారణలో నవీదీప్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నట్లు తెలుస్తోంది. ఆధారాలు ముందుంచి ప్రశ్నిస్తే వాటికి నవదీప్ మౌనమే సమాధానమైంది. తను డ్రగ్స్ కొనుగోలు చేయలేదని హీరో చెబుతున్నారు. రాంచంద్రకు తనకు ఆర్థిక లావాదేవీలు ఉన్న మాట వాస్తవమేనని విచారణలో నవీదప్ తెలిపారు. అయితే ఆ ఆర్థిక లావాదేవీలు డ్రగ్స్‌కు సంబంధించినవి కాదని అన్నారు. కాగా.. నవదీప్ ఒప్పుకుంటే నార్కోటిక్ పోలీసులు శాంపిల్స్ సేకరించే అవకాశం ఉంది. రిపోర్ట్స్ అనంతరం డ్రగ్స్ వాడినట్టు తేలితే రిహబిలిటేషన్ సెంటర్‌కు పంపించనున్నారు.
నార్కోటిక్ అధికారుల ప్రశ్నలు ఇవే..
విచారణలో భాగంగా నవదీప్ ముందు నార్కోటిక్ బ్యూరో అధికారులు 20 ప్రశ్నలు ఉంచినట్లు తెలుస్తోంది. రాంచంద్‌తో పరిచాయలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
నవదీప్, రాంచంద్ ఇద్దరు అత్యంత సన్నిహితులు.. ఇద్దరు కలిసి ఎప్పుడు ఎక్కడ ఎలా డ్రగ్స్ తీసుకున్నారు?
రాంచంద్‌తో ఉన్న పరిచయం ఏంటి?
రాంచంద్ చివరిసారిగా ఎప్పుడు కలిశారు?
రాంచంద్ ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చేవాడు?
మాజీ ఎంపీ విట్టల్ రావు కుమారుడు సురేష్ తో ఉన్న పరిచయాలు ఏంటి?
సురేష్, రామచంద్లతో కలిసి ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకున్నారా?
రాంచంద్, సురేష్2లకు ఎప్పుడైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారా?
స్నార్ట్ పబ్ వ్యవహారాలపై నార్కోటిక్ బ్యూరో అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-09-23T14:13:53+05:30 IST