Shamshabad Airport : ఎయిర్‌పోర్టులో హై అలర్ట్.. ప్రయాణికులు ఈ విషయాన్ని తెలుసుకోండి..
ABN, First Publish Date - 2023-08-09T12:45:51+05:30
ఆగస్టు 15 పంద్రాగస్టు పురస్కరించుకొని అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయంలోని ప్రధాన రహదారిలో సీఐఎస్ఎఫ్, రక్ష, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆగస్టు 15 వరకూ విమానాశ్రయంలోకి సందర్శకులు ఎవరికి ఎంట్రీ లేదని ప్రకటించారు.
హైదరాబాద్ : ఆగస్టు 15 పంద్రాగస్టు పురస్కరించుకొని అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో హై అలర్ట్ ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయంలోని ప్రధాన రహదారిలో సీఐఎస్ఎఫ్, రక్ష, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆగస్టు 15 వరకూ విమానాశ్రయంలోకి సందర్శకులు ఎవరికి ఎంట్రీ లేదని ప్రకటించారు. ప్రయాణికులు,వారితో వెళ్లేవారికి అధికారులు కొన్ని సూచనలు చేశారు. అన్ని రకాల పాసులను ఆగస్టు 16 వరకూ బలగాలు రద్దు చేశాయి.
విమానాశ్రయంలోని పార్కింగ్, డిపార్చర్, అరైవెల్ లో సీఐఎస్ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. విదేశాలకు వెళుతున్న ప్రయాణికులకు వీడ్కోలు తెలపడానికి ఒకరు లేదా ఇద్దరు రావాలి తప్ప అధిక సంఖ్యలో వస్తే అనుమతించబోమని అధికారులు అంటున్నారు. ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల రాకతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కరిని పంపించడానికి తల్లిదండ్రులతో పాటు బంధువులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక ఈ 15 రోజులు రావద్దంటూ కేంద్ర బలగాలు అలర్ట్ చేస్తున్నాయి.
Updated Date - 2023-08-09T12:55:01+05:30 IST