ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

T.Highcourt: బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వాన్ని నిలదీసిన న్యాయస్థానం

ABN, First Publish Date - 2023-07-24T15:29:53+05:30

బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు(మంగళవారం) ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ధర్నా చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యంపై మహాధర్నా చేయాలని బీజేపీ నిర్ణయించింది.

హైదరాబాద్: బీజేపీ మహాధర్నాకు (BJP Mahadharna) తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు(మంగళవారం) ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో ధర్నా చేసుకోవచ్చని న్యాయస్థానం తెలిపింది. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యంపై మహాధర్నా చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో మహాధర్నాకు పోలీసుల అనుమతిపై హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. అయితే ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదించారు. కేంద్రం ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా? అంటూ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని అడిగింది. ఐదువేల మందికి మీరు భద్రత కల్పించలేక పోతే ఎలా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ ధర్నా కు పిలుపునిచ్చినప్పుడు పోలీసులు అనుమతి నిరాకరిస్తే ఎలా అని సర్కార్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. చివరకు బీజేపీ మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కేవలం ధర్నా చేసుకోవాలని, ఎలాంటి ర్యాలీ చేయవద్దని ఆదేశించింది. అలాగే 500 మందితో ధర్నా చేసుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. బీజేపీ తరపున న్యాయవాది రచనా రెడ్డి వాదనలు వినిపించారు.

Updated Date - 2023-07-24T15:35:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising