ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderbad: అక్కడ కొట్టేసి.. ఇక్కడ అమ్మేస్తారు

ABN, First Publish Date - 2023-02-23T10:48:10+05:30

వీరి టార్గెట్ ఖరీదైన కార్లు.. చాకచక్యంగా కొట్టేస్తారు.. ఆనవాళ్లు లేకుండా చేస్తారు.. ఆపై విక్రయిస్తారు. కొంతకాలంగా ఇలాంటి దందాకు పాల్పడుతున్న ముఠా సభ్యుల ఆటకట్టించారు సిటీ నార్త్ జోన్ పోలీసులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ, ఆంధ్రజ్యోతి: ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఖరీదైన కార్లను లక్ష్యంగా చేసుకుని చాకచక్యంగా వాటిని చోరీ చేస్తారు.. గుట్టుగా హైదరాబాద్‌ నగరానికి తరలిస్తారు. ఆ తర్వాత వాటిని తక్కువ ధరకు అమ్మేసి సొమ్ము చేసుకుంటారు. కొంతకాలంగా ఇలాంటి దందాకు పాల్పడుతున్న ముఠా సభ్యుల ఆటకట్టించారు సిటీ నార్త్‌జోన్‌ పోలీసులు. ముఠాలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి రూ. 2.45కోట్ల విలువైన ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్‌జోన్‌ డీసీపీ సునీల్‌ దత్‌, సిటీ క్రైమ్స్‌ ఇన్‌చార్జి డీసీపీ శబరీష్‌ సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.

ముషీరాబాద్‌ జమిస్తాపూర్‌కు చెందిన అబ్దుల్‌ రహీంఖాన్‌ దొంగ కార్లు తెచ్చి నగరంలో విక్రయిస్తున్నాడని చిలకలగూడ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు వెలుగుచూశాయి. కోల్‌కతాకు చెందిన బప్పా గోష్‌ ద్వారా కార్లు నగరానికి వస్తున్నాయని చెప్పడంతో ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. దీని వెనుక పెద్ద ముఠా ఉందని భావించిన పోలీస్‌ ఉన్నతాధికారులు కేసును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు అప్పగించారు. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, ఎస్సై అశోక్‌రెడ్డి, శ్రీకాంత్‌, అనంతచారి, అరబింద్‌ గౌడ్‌లతో కలిసి రంగంలోకి దిగారు. ఈ ముఠాలో రహీంఖాన్‌తోపాటు మొత్తం ఎనిమిది మంది ఉన్నట్లు గుర్తించారు.

బప్పా గోష్‌ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలోని పలు ప్రాంతాల్లో ఖరీదైన కార్లను చాకచక్యంగా చోరీ చేస్తాడు. వాటిని నగరంలోని రహీంఖాన్‌, ఠాగూర్‌ శైలేందర్‌, షేక్‌ జావిద్‌, వరికుప్పల దశరథ్‌, షానవాజ్‌ అలీఖాన్‌, కొడిమళ్ల పరిపూర్ణాచారి, కలీం ద్వారా విక్రయిస్తాడు. చోరీ చేసిన కార్లకు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చేయడానికి నంబర్‌ ప్లేట్‌, రిజిస్ట్రేషన్‌ ఇంజన్‌ ఛాసెస్‌ నంబర్‌ తొలగిస్తాడు. ఆ తర్వాత తక్కువ ధరకు విక్రయిస్తాడు. బప్పాగో్‌షపై ఇదివరకే ఢిల్లీ, యూపీలలో 14 కేసులు నమోదై ఉన్నాయి. అలాగే, తుర్కయాంజల్‌కు చెందిన వరికుప్పల దశరథ్‌ ఆధ్వర్యంలో మిర్యాలగూడలో ఓ కారు అమ్మడంతో అక్కడా కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని అనుచరుల ద్వారా ఇటీవల విక్రయించిన 18కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో రహీంఖాన్‌, ఠాగూర్‌ శైలేందర్‌, షేక్‌ జావీద్‌, వరికుప్పల దశరథ్‌, షానవాజ్‌ ఆలీఖాన్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బప్పా గోష్‌ కోసం పోలీసు టీమ్‌ కోల్‌కతా వెళ్లింది. గోష్‌ దొరికితే ఈ ముఠా అక్రమాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని డీసీపీ తెలిపారు.

Updated Date - 2023-02-23T10:51:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising