Hyderabad: పిల్లలు పుట్టడంలేదని భర్త విడాకుల నోటీస్.. భార్య ఆత్మహత్యాయత్నం
ABN, First Publish Date - 2023-03-18T08:34:35+05:30
వివాహమై ఐదు సంవత్సరాలైనా పిల్లలు పుట్టడం లేదని భర్త విడాకుల నోటీస్ ఇవ్వడంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్యకు యత్నించింది.
హైదరాబాద్: వివాహమై ఐదు సంవత్సరాలైనా పిల్లలు పుట్టడం లేదని భర్త విడాకుల నోటీస్(Divorce Notice) ఇవ్వడంతో మనస్తాపానికి గురైన భార్య ఆత్మహత్యకు యత్నించింది. వివరాల్లోకి వెళితే... నార్సింగ్‌కు చెందిన సబితకు, రాందేవ్‌గూడకు చెందిన నర్సింగ్‌కు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. ఇప్పటి వరకూ పిల్లలు పుట్టలేదని విడాకుల కోసం భర్త లీగల్ నోటీస్ (Legal Notice) పంపడంతో మనస్తాపానికి గురైన సబిత శుక్రవారం ఇంట్లో బాత్‌ర క్లీనర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఇంకా ఫిర్యాదు రాలేదని వస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని నార్సింగ్ పోలీసులు తెలిపారు.
Updated Date - 2023-03-18T08:37:41+05:30 IST