Hyderabad: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే.. పోలీసులు ఏం చేశారో తెలుసా..?
ABN, First Publish Date - 2023-03-22T18:27:11+05:30
ట్రాఫిక్ నిబంధనలు(Traffic Rules) పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని, చలానాలను(Challans) తప్పించునేందుకు నెంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేయవద్దని పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు.
హైదరాబాద్: ట్రాఫిక్ నిబంధనలు(Traffic Rules) పాటిస్తూ ప్రమాదాలను నివారించాలని, చలానాలను(Challans) తప్పించునేందుకు నెంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేయవద్దని పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. రాచకొండ పరిధిలో వాహనాల తనిఖీల్లో డ్రంకెన్‌డ్రైవ్ (Drunken Drive) చేస్తూ పట్టుబడిన 49మందికి ఎల్బీనగర్‌లోని రాచకొండ ట్రాఫిక్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్(టీటీఐ) కౌన్సెలింగ్ కేంద్రంలో ఇన్స్‌పెక్టర్ జోసెఫ్ కౌన్సెలింగ్ నిర్వహించారు. టీటీఐ ఆవరణలో వారిచే వినూత్నంగా ఆంగ్ల అక్షరాల ఫ్లకార్డులతో డోంట్ ట్యాంపర్ నంబర్ ప్లేట్స్ (నంబర్ ప్లేట్లు ట్యాంపరింగ్ చేయొద్దు) అనే నినాదాన్ని ప్రదర్శించారు.
ట్రాఫిక్ నిబంధనలపై, చలానాలు తప్పించుకునేందుకు వాహనాల నెంబర్ ప్లేట్ల(Vehicle Number Plates)ను వంచేసి, మాస్కులు తగిలించేసి, నంబర్ సరిగా కనిపించకుండా చేయడం తదితర ట్యాంపరింగ్ అంశాలపై రాచకొండ పరిధిలోని ప్రధాన కూడళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. నేరం చేసిన వారు తమ వాహనాలను గుర్తించకుండా నంబర్ ప్లేట్లను ట్యాంపరింగ్ చేస్తుంటారని, సీసీ కెమెరాలకు దొరకకుండా వాహనాలను గుర్తించకుండా తప్పించుకునేందుకు యత్నిస్తుంటారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌పీఓ అల్లూరయ్య, సిబ్బంది రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-22T18:27:29+05:30 IST