ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Drugs Case: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక అంశాలు

ABN, First Publish Date - 2023-07-24T12:11:43+05:30

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

హైదరాబాద్: హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్ తరహాలోనే డ్రగ్స్ కేసులోనూ విదేశాలకు ప్రాఫిట్ మళ్లింపు జరిగినట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి కొన్ని రోజుల క్రితం ముగ్గురు నైజీరియన్లను హైదరాబాద్‌ నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఇద్దరు ఇండియన్స్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి లావాదేవీలపై దృష్టి పెట్టిన హైదరాబాద్ పోలీసులకు కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. డ్రగ్స్ కోసం కస్టమర్ల నుండి రూ.4 కోట్ల రూపాయలు వసూలు చేశారని.. ఆ రూ.4 కోట్లను 22 విదేశీ అకౌంట్‌లకు మళ్లించినట్టు గుర్తించారు. 22 అకౌంట్లలోనూ హెన్రీ అనే డ్రగ్ సప్లయర్ ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో హెన్రీ కోసం హైదరాబాద్ పోలీసుల వేట కొనసాగుతోంది. 22 బ్యాంక్ అకౌంట్స్ పరిశీలన కోసం హైదరాబాద్ పోలీసులు ప్రైవేట్ ఏజెన్సీని ఆశ్రయించారు. వీరి వద్ద నుంచి 200 మంది కస్టమర్లు డ్రగ్స్ సేకరించారని... వారిలో 90 శాతం బెంగళూరుకు చెందిన కస్టమర్లు ఉన్నట్టు గుర్తించారు. మరో 10% తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కస్టమర్లు ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల కస్టమర్స్‌గా ఉన్నవారు బెంగళూరులో చదువుకునే రోజుల్లో డ్రగ్స్ కొన్నట్టు విచారణలో పోలీసులు గుర్తించారు.

Updated Date - 2023-07-24T12:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising