Hyderabad: నేడు నగరంలో హనుమాన్ శోభాయాత్ర
ABN, First Publish Date - 2023-04-06T07:46:37+05:30
నేడు భాగ్యనగరంలో హనుమాన్ శోభాయాత్ర(Hanuman Shobhayatra) నిర్వహించనున్నారు. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి శోభాయాత్ర
హైదరాబాద్: నేడు భాగ్యనగరంలో హనుమాన్ శోభాయాత్ర(Hanuman Shobhayatra) నిర్వహించనున్నారు. ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి శోభాయాత్ర ప్రారంభంకానుంది. తాడ్‌బండ్ వీరాంజనేయ ఆలయం(Tadband Veeranjaneya Temple) రాత్రి 8 గంటలకు శోభాయాత్ర ముగింపు కానుంది. హనుమాన్ శోభాయాత్రకు 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర మార్గంలో 850 కెమెరాలతో పోలీసుల నిఘా పెట్టారు. శోభాయాత్ర సందర్భంగా పలుచోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్(Traffic diversions) కూడా ఏర్పాటు చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా నేడు మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు.
ట్రాఫిక్ మళ్లింపులు
అఫ్జల్‌గంజ్ నుండి వచ్చే వాహనాలను ఎస్ఎ మస్జీద్ నుంచి ఎంజిబీఎస్ బస్టాండ్ వైపు మళ్లింపు..
రంగమహల్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను సీబీఎస్ వైపు మళ్లింపు.
కోటి వైపు వచ్చే వాహనాలను చాదర్ఘాట్ ఎక్స్ రోడ్స్ వద్ద డైవర్ట్ చేసి నింబోలిఅడ్డ రంగ మహల్ వైపు వెళ్తాయి.
కాచిగూడ వైపు నుండి వచ్చే ట్రాఫిక్‌ను లింగంపల్లి ఎక్స్‌రోడ్ నుండి పోస్ట్ ఆఫీస్ రోడ్డు చప్పల్ బజార్ వైపు మళ్లించబడుతుంది.
నారాయణగుడా షాలిమార్ థియేటర్ వైపు వాహనాలను షాలిమార్ మీదుగా ఈడెన్ గార్డెన్ వైపు మళ్ళించబడతాయి.
ఈసారి నిర్వహకులకు నిర్ణీత ఎత్తులో డీజేలు అమర్చుకోవాలని పోలీసుల సూచన
ఆ ట్రాఫిక్‌ను కర్బలా మైదాన్ గుండా మహాంకాళి ట్రాఫిక్ మళ్లించబడుతుంది..
Updated Date - 2023-04-06T07:54:37+05:30 IST