ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hyderabad: 48 గంటల్లో నివేదిక ఇవ్వండి

ABN, First Publish Date - 2023-03-24T05:41:30+05:30

తెలంగాణలో కలకలం రేపిన పోటీపరీక్షల ప్రశ్న పత్రాల లీక్‌ కేసు తాజా పరిస్థితిపై 48 గంటల్లో నివేదిక అందించాలని గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ ప్రభుత్వాన్ని కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్‌,(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కలకలం రేపిన పోటీపరీక్షల ప్రశ్న పత్రాల లీక్‌ కేసు తాజా పరిస్థితిపై 48 గంటల్లో నివేదిక అందించాలని గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌ ప్రభుత్వాన్ని కోరారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం నియమించిన సిట్‌ విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు విచారణలో తేలిన అంశాలను నివేదించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శికి గురువారం గవర్నర్‌ లేఖలు రాశారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు ఎంత మంది హాజరయ్యారు..? అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు..? అందులో 100 మార్కులకు పైగా సాధించిన వారి సమాచారాన్ని అందించాలని కోరారు.

టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తూ.. కమిషన్‌ అనుమతితో, అనుమతి లేకుండా పరీక్షలకు హాజరైన రెగ్యులర్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వివరాలను ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని కోరారు. పరీక్షలు రాసిన వారు సన్నద్ధత కోసం ఎన్ని రోజులు సెలవు పెట్టారు..? ఎన్ని రోజులు ఆఫీసుకు వచ్చారు..? తదితర వివరాలను అందించాలని టీఎస్‌పీఎస్సీ ని ఆదేశించారు.

కాగా, టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు నిరుద్యోగులు గవర్నర్‌ను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. గవర్నర్‌ తన అధికారంతో కమిషన్‌ చైర్మన్‌, సభ్యులను సస్పెండ్‌ చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు.

అయితే ఈ వ్యవహారంలో తన పరిధిపై న్యాయ నిపుణులతో చర్చించి సలహా తీసుకుంటానని గవర్నర్‌ తెలిపారు. తాజాగా లీకేజీ కేసు నివేదికను కోరుతూ గవర్నర్‌ నేరుగా రంగంలోకి దిగడం చర్చనీయాంశమైంది. నివేదిక అందాక గవర్నర్‌ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిసింది.

Updated Date - 2023-03-24T05:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising