కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: ఎల్లుండి నుంచి హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో 30 గంటల పాటు నీరు బంద్‌

ABN, First Publish Date - 2023-08-17T19:28:40+05:30

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు ఈ నెల 19న 30 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్‌ సప్లయ్‌ ఫేజ్‌-2లో కలబ్‌గూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు, పటాన్‌చెరు నుంచి హైదర్‌నగర్‌ వరకు గల 1,500 ఎంఎం డయా ఎంఎస్‌ పైపులైన్‌కు జంక్షన్‌ పనులు చేపడుతున్నారు.

Hyderabad: ఎల్లుండి నుంచి హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో 30 గంటల పాటు నీరు బంద్‌

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలకు ఈ నెల 19న 30 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు వాటర్‌బోర్డు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న మంజీరా వాటర్‌ సప్లయ్‌ ఫేజ్‌-2లో కలబ్‌గూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు, పటాన్‌చెరు నుంచి హైదర్‌నగర్‌ వరకు గల 1,500 ఎంఎం డయా ఎంఎస్‌ పైపులైన్‌కు జంక్షన్‌ పనులు చేపడుతున్నారు.


ఆర్‌అండ్‌బీ శాఖ బీహెచ్‌ఈఎల్‌ క్రాస్‌ రోడ్‌ వద్ద నూతనంగా నిర్మిస్తోన్న ఫ్లైఓవర్‌ పనులకు ఆటంకం లేకుండా ఈ జంక్షన్‌ వద్ద పనులు చేపడుతున్నారు. 19న ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు పనులు చేపడతారు. దీంతో 30 గంటలపాటు పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుందని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-08-17T19:31:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising