ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Shekhawat: మేడిగడ్డపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సంచలన ట్వీట్‌

ABN, First Publish Date - 2023-11-03T16:03:47+05:30

మేడిగడ్డ ప్రాజక్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సంచలన ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ అవినీతి బట్టబయలు అయిందంటూ

ఢిల్లీ: మేడిగడ్డ ప్రాజక్టుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సంచలన ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ అవినీతి బట్టబయలు అయిందంటూ జలశక్తి మంత్రి విమర్శించారు. కేసీఆర్‌ ధనదాహం, అవినీతి, దురాశ కారణంగా.. లక్షలాది మంది జీవితాలు ప్రమాదంలో పడ్డాయని పేర్కొన్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని ఆరోపించారు. కుంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టు ఫొటోలు, వీడియోలు, డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదికను షెకావత్ ట్వీట్ చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు అక్టోబర్ 22న కుంగిపోయాయి. ఈ ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్యారేజ్ ప్లానింగ్, డిజైన్ సరిగా లేదని తేల్చింది. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయని పేర్కొంది. బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయిందని.. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదని తేల్చింది. బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయిందని స్పష్టం చేసింది.

ఎన్నికల సమయంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పటికే రాహుల్ నేతృత్వంలో ప్రాజెక్ట్‌ను సందర్శించి బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి చేసిన ట్వీట్ పొలిటికల్‌గా ఆసక్తి రేపుతోంది.

Updated Date - 2023-11-03T16:16:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising