ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi .. సీఎం కేసీఆర్ వెళ్లే మార్గం సైతన్ మార్గం: కేఏ పాల్

ABN, First Publish Date - 2023-02-12T16:18:05+05:30

ఢిల్లీ: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ప్రజా శాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు (Birthday Greetings) తెలుపుతూ.. విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మారాలని కోరుకుంటున్నానని, ఆయన వెళ్లే మార్గం సైతన్ మార్గమని వ్యాఖ్యానించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar) ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా.. అప్పులు లేని తెలంగాణ చేయాలని 9 ఏళ్లుగా కేసీఆర్‌ను కోరుతున్నానని అన్నారు. మార్పు చెందకపోతే ముఖ్యమంత్రి పతనం ఆరంభం అవుతుందని చెప్పానని.. ఇప్పుడు అదే జరుగుతోందన్నారు.

సీఎం కేసీఆర్ పుట్టిన రోజున సచివాలయ ప్రారభోత్సవం విషయంలో వెనక్కి తగ్గారని.. అంటే ముఖ్యమంత్రి ఓడిపోయారని.. అంబెద్కర్ గెలిచారని.. బడుగు బలహీన వర్గాలు గెలిచాయని కేఏ పాల్ అన్నారు. రూ. 5 లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణను సర్వనాశనం చేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. అంబెద్కర్ జయంతి ఏప్రిల్ 14న సచివాలయం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తనకు భద్రత తన దేవుడేనని అన్నారు.

సీఎం కేసీఆర్ తనపై ప్రధాని మోదీ (PM Modi)పై దాడులు చేస్తున్నారని.. అయినా తగ్గేదే లేదని.. తనను అరెస్టు చేసినా.. దాడులు చేసినా భయపడనని కేఏ పాల్ అన్నారు. ముఖ్యమంత్రిపై కలిసి పోరాడటానికి ప్రజలు ముందుకు రావాలని పిలుపిచ్చారు. ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (BRS MLAs) తనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీ (BJP)ని చిత్తు చిత్తుగా ఓడించాలన్నారు. దేశాన్ని అమ్మేసింది.. నాశనం చేసింది బీజేపీయేనని, ప్రధాని మోదీ దేశాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా అడ్డుకున్నానని చెప్పారు. తాము ఎమ్మెల్యేలను కొనమని.. నిజాయితీగా ఉన్నవారు ఎవరైనా ప్రజాశాంతి పార్టీలో చేరవచ్చునని కేఏ పాల్ పిలుపిచ్చారు.

Updated Date - 2023-02-12T16:18:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising