KA Paul: బీబీసీ గొంతునొక్కే ప్రయత్నం...
ABN, First Publish Date - 2023-02-15T16:27:12+05:30
ఢిల్లీ: దేశంలో అవినీతి తారా స్థాయికి చేరుకుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు (Praja Shanti Party President) కేఏ పాల్ (KA Paul) విమర్శించారు.
ఢిల్లీ: దేశంలో అవినీతి తారా స్థాయికి చేరుకుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు (Praja Shanti Party President) కేఏ పాల్ (KA Paul) విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ మీడియా సంస్థలపై అనవసరంగా ఈడీ (ED), ఐటీ (IT), సీబీఐ (CBI)లను ఉపయోగించకూడదని ప్రధాని మోదీ (PM Modi), హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)లను కోరుతున్నానన్నారు. ఆదాయపన్ను శాఖ దాడులు బీబీసీ (BBC)పై ఎందుకు జరిగాయి?.. బీబీసీ గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. భారత మీడియా సంస్థల లాగా అంతర్జాతీయ మీడియా నోరు మూయించలేరని.. వాటిని కొనుగోలు చేయలేరని అన్నారు. అంతర్జాతీయ మీడియాలతో యుద్ధం చేయవద్దని కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తున్నానన్నారు. ప్రపంచంలో పెద్ద పెద్ద నేతలే అంతర్జాతీయ మీడియాను తట్టుకోలేక పోయారని, జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడతారని కేఏ పాల్ సూచించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో మరికొందరు దొరుకుతారని, రానున్న రోజులలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)ను అరెస్ట్ చేయబోతున్నట్లు తనవద్ద సమాచారం ఉందని కేఏ పాల్ అన్నారు. కేంద్రాన్ని ఎదిరించి నిలబడ్డ ఎన్టీఆర్ (NTR)లాంటి నాయకులు నేడు లేరని అన్నారు. ఇప్పుడు ఉన్న నాయకులు, సీఎంలు నరేంద్రమోదీకి బానిసలేనని.. ఆయనను ఎదిరించే ధైర్యం లేదని అన్నారు.
సీఎం కేసీఆర్ (CM KCR) దళిత, బడుగు బలహీన వర్గాల ద్రోహి అని కేఏ పాల్ విమర్శించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే… ఏప్రిల్14వ తేదీన తెలంగాణ సచివాలయం (Secretariat) అంబేద్కర్ (Ambedkar) పేరు మీద ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ జన్మదినం రోజున తెలంగాణ సచివాలయం ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌కు 72 గంటల అల్టిమేటం జారీ చేస్తున్నానన్నారు. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దళితులపై, అంబేద్కర్‌పై ప్రేమ ఉంటే పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
Updated Date - 2023-02-15T16:27:16+05:30 IST