ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kishan Reddy: కవిత అరెస్టు మా చేతుల్లో లేదు...

ABN, First Publish Date - 2023-05-21T14:32:33+05:30

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పుకు అవకాశమే లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పష్టం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పుకు అవకాశమే లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న వార్తలు బేస్ లెస్ అని, మేమంతా ఒకే కుటుంబమని. తమ జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవటం సహజమని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam)లో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అరెస్ట్ తమ చేతుల్లో లేదని, సీబీఐ (CBI) పరిధిలోని అంశమని స్పష్టం చేశారు.

ఆధారాలున్నాయి కాబట్టే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని సీబీఐ అరెస్ట్ చేసిందని, అవినీతికి పాల్పడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను సైతం జైలుకు పంపించామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ను ఎంఐఎం ‌పార్టీ నడిపిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో ఒక వార్డ్ మెంబర్ గెలిచినందుకే సంబరపడిపోతున్నారని వ్యాఖ్యానించారు. రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణను అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారన్నారు. ‘నోట్ల రద్దులో మా ప్లాన్ మాకు ఉంది’.. కర్ణాటక ఎన్నికల‌ ప్రభావం తెలంగాణలో ఉండదన్నారు. కాంగ్రెస్‌కు తెలంగాణలో భవిష్యత్తు లేదని, బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-05-21T14:32:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising