ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM KCR: స్వప్నలోక్‌ ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

ABN, First Publish Date - 2023-03-17T12:12:00+05:30

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌ (Swapnalok Fire Accident)లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CMKCR) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించివారికి రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియా (Exgratia)ను ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali), మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ (Minister Talasani Srinivas Yadav)కు సీఎం కేసీఆర్ (Telangana CM) సూచించారు.

కాగా... సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. 12 మంది సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిప్రమాదం కారణంగా చుట్టుముట్టిన పొగను పీల్చి అపస్మారక స్థితికి చేరుకున్న ఆరుగురినీ చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎనిమిదో అంతస్తులో మొదలైన మంటలు 7, 6, 5 అంతస్తులకు వ్యాపించాయి. ఒకవైపు వర్షం కురుస్తున్నా.. అగ్నిజ్వాలలు వ్యాపించడంతో ఆ సమయంలో భవనంలో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేసేందుకు తీవ్రంగా శ్రమించారు. దాదాపు మూడు గంటలపాటు మంటలు తగ్గినట్టే తగ్గి మళ్లీ వ్యాపిస్తుండడంతో అప్రమత్తమైన అగ్నిమాపక అధికారులు.. అదనపు ఫైరింజన్లను రప్పించారు. మొత్తం 15 అగ్నిమాపక శకటాలను ఉపయోగించి మంటలను అదుపులోకి తెచ్చారు.

మొదలైన పోస్టుమార్టం..

మరోవైపు గాంధీ మార్చురిలో స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద మృతుల డెడ్‌బాడీలకు పోస్టుమార్టం ప్రక్రియ మొదలైంది. పోస్టుమార్టం అనంతరం డెడ్ బాడీలను కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించనున్నారు. ఇప్పటికే గాంధీకి చేరుకున్న కుటుంబసభ్యులు... తమ పిల్లల మృతదేహాలను చూసి బోరుమంటున్నారు. అలాగే గాంధీ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను లోపలకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. మృతుల కుటుంబ సభ్యులు పెద్దఎత్తున తరలివస్తుండటంతో పోలీసులు భద్రతను మరింత పెంచారు. క్విక్ యాక్షన్ టీంలను గాంధీ ముందు మోహరించారు. రోగులు, రోగుల కుటుంబ సభ్యులను మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిస్తున్నారు.

Updated Date - 2023-03-17T12:12:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising