ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kirankumar Reddy: నేడు బీజేపీలో చేరనున్న కిరణ్‌కుమార్ రెడ్డి

ABN, First Publish Date - 2023-04-07T10:10:05+05:30

ఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) శుక్రవారం బీజేపీ (BJP)లో చేరనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) శుక్రవారం బీజేపీ (BJP)లో చేరనున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ (Congress) పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు 12 గంటలకు ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి రెండు రాష్ట్రాల్లో పార్టీకి ఉపయోగపడతారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తిరిగి ఆయన యాక్టివ్ పొలిటిక్స్‌లోకి రావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఇవాళ బీజేపీ కేంద్ర నాయకుల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. ఎందుకో కానీ ఆ పార్టీ అంతగా ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా ఎప్పుడూ కూడా యాక్టివ్‌ పార్ట్ అనేది తీసుకోలేదు. ఇప్పుడు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రాయలసీమలో తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు బీజేపీ సైతం ఆయనను ఆహ్వానిస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2023-04-07T10:10:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising