Kishan Reddy: కల్వకుంట్ల కుటుంబంతో యుద్ధం మొదలైంది..
ABN, First Publish Date - 2023-07-20T15:03:43+05:30
హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబంతో యుద్ధం మొదలైందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బాటాసింగారంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళుతున్న ఆయనను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్: కల్వకుంట్ల కుటుంబం (Kalvakuntla Family)తో యుద్ధం మొదలైందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. బాటాసింగారంలో డబుల్ బెడ్ రూమ్ (Double Bedroom) ఇళ్ల పరిశీలనకు వెళుతున్న ఆయనను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR) యుద్ధం మెదలు పెట్టారని... బీజేపీ (BJP) యుద్ధన్ని ముగిస్తుందని స్పష్టం చేశారు. ఆట మెదలైందని, ఆట ఎలా ఆడాలో బీజేపీకి తెలుసునని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి రాష్ట్రంలో 50 లక్షల ఇళ్ళు కట్టే దమ్ముందా?.. కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత తనదని అన్నారు. ప్రభుత్వ క్వాటర్స్ కూల్చివేసి కేసీఆర్ పది ఎకరాల్లో ఇల్లు కట్టుకున్నారని విమర్శించారు.
శాంతియుతంగా అంబేడ్కర్ స్పూర్తితో బీఆర్ఎస్ సర్కార్‌తో యుద్ధం చేస్తామని, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం యుద్ధానికి బీజేపీ సిద్దంగా ఉందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వారసత్వంతో తాను కేంద్రమంత్రిని కాలేదని, ఈ విషయం బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. పార్టీలు మారిన వ్యక్తులకు తనను విమర్శించే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ పాపం పండిందని, కేసీఆర్‌ను గద్దె దించేవరకు పోరాడుతామన్నారు. తొమ్మిదేళ్ళల్లో ఒక్క రేషన్ కార్డ్ కూడా ఇవ్వని చరిత్ర కేసీఆర్‌దని ఆరోపించారు.
తన రాజకీయ జీవితం పోరాటాలతో మొదలైందని, తాను ఉగ్రవాదిని కాదని.. సంఘ విద్రోహ శక్తిని అంతకన్నా కాదని కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రమంత్రిగా ఉన్న తనను.. రోడ్డు బ్లాక్ చేసి కాన్వాయ్‌ను ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. తమ నీడను చూసుకుని కల్వకుంట్ల కుటుంబం భయపడుతోందన్నారు. కేసీఆర్ అభద్రతాభావంలో ఉన్నారని, మొండి గోడలను పరిశీలిస్తే కేసీఆర్‌కు వచ్చిన బాధ ఎంటో చెప్పాలన్నారు. బీజేపీ నేతలను అరెస్టులతో ఆపలేరని.. పేదల పక్షాన బీజేపీ పోరాటం చేస్తోందన్నారు.
Updated Date - 2023-07-20T15:03:43+05:30 IST