ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kokapet Lands: ఎకరం 100 కోట్లు!

ABN, First Publish Date - 2023-08-04T02:56:36+05:30

కోకాపేట.. భూముల(Kokapet Lands) వేలంతో కోట్లపేటగా మారింది. గురువారం ఆన్‌లైన్‌లో జరిగిన కోకాపేట భూముల వేలంలో ఎకరం రూ.100.75 కోట్ల రికార్డు ధర(Record price) పలికింది.

కోకాపేట నియోపోలిస్‌ ఫేజ్‌-2లో ఉత్కంఠగా భూముల వేలం

అత్యధిక ధరతో దక్కించుకున్న రాజపుష్ప ప్రాపర్టీస్‌

రాష్ట్రంలోనే ఆల్‌టైం రికార్డు ధర

అంచనాలకు మించి వచ్చిన రాబడి

గతంతో పోల్చితే రెట్టింపు ధర

45 ఎకరాలు.. రూ.3319కోట్ల ఆదాయం

సగటున ఎకరం 73కోట్లకు పైనే

తెలంగాణ పరపతికి దర్పణం కోకాపేట భూముల వేలంపై సీఎం

ఆర్థిక కోణం కాదు ప్రగతి కోణంలో చూడాలని ప్రకటన

ఎకరం 35 కోట్లు.. ఇది కోకాపేట నియోపోలిస్‌ ఫేజ్‌-2లో హెచ్‌ఎండీఏ నిర్ణయించిన భూముల ధర! కానీ.. రియల్టీ సంస్థలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. దీంతో రూ.40 కోట్లు.. 50.. 60.. 70 కోట్లు.. పోటీ పెరిగి ఎకరం భూమి 100 కోట్ల ధర పలికింది. ఈ వేలాన్ని చూసిన చాలామంది నోట నుంచి వచ్చిన ఒకే ఒక్క మాట.. ‘అది భూమా? లేక బంగారు గనా?’’ ..అని!!

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు3 (ఆంధ్రజ్యోతి): కోకాపేట.. భూముల(Kokapet Lands) వేలంతో కోట్లపేటగా మారింది. గురువారం ఆన్‌లైన్‌లో జరిగిన కోకాపేట భూముల వేలంలో ఎకరం రూ.100.75 కోట్ల రికార్డు ధర(Record price) పలికింది. అక్కడ గత ఏడాది జరిగిన భూముల వేలంలో అత్యధికంగా ఎకరం రూ.60.20 కోట్లకు దక్కించుకున్న రాజపుష్ప రియల్టీ సంస్థే(Rajapuspa Realty is a company).. ఈసారి ఎకరం రూ.100 కోట్లు పెట్టి కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఎకరాకు రూ.35 కోట్లు కనీస ధరను హెచ్‌ఎండీఏ అధికారులు(HMDA officials) నిర్ణయించగా.. అధికారుల అంచనాలకు మించి సగటున ఎకరం ధర రూ.73.23 కోట్లు పలికింది. కనీస ధరకు రెట్టింపు స్థాయిలో ఖర్చు చేసి భూములను కొనుగోలు చేసేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. అత్యల్పంగా ఎకరం రూ.67.25 కోట్లు పలికింది. హెచ్‌ఎండీఏ విక్రయించిన 45.33 ఎకరాలకుగాను రూ.3319.60 కోట్ల ఆదాయం వచ్చింది. కోకాపేట భూముల వేలంపై ఎక్కడా కూడా 111జీవో తొలగింపు ప్రభావం కనిపించలేదు. కోకాపేటలో హెచ్‌ఎండీఏ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తున్న నియోపోలిస్‌ లే-అవుట్‌(Neopolis lay-out)లో ఫేజ్‌-2లో 3.60 ఎకరాల నుంచి 9.71 ఎకరాల విస్తీర్ణంతో ఉండే ఏడు ప్లాట్లను గురువారం ఎంఎ్‌సటీసీ ఈ-కామర్స్‌ అనే కేంద్ర ప్రభుత్వ(Central Govt) రంగం సంస్థ ద్వారా ఈ-వేలం వేశారు. ఉదయం నుంచి జరిగిన భూముల వేలం రాత్రి 7 గంటల వరకూ ఉత్కంఠంగా సాగింది. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ 6, 7, 8, 9 ప్లాట్లను వేలం వేయగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 10, 11, 14ప్లాట్లను వేలం వేశారు. ఈ-వేలంలో పాల్గొన్న పలు రియల్‌ ఎస్టేట్‌(Real estate) ఇతరతర సంస్థలు పోటా పోటీగా రేటు పెంచాయి. అత్యధికంగా ఎకరం రూ.100.75కోట్లు పలికిన 10వ నంబర్‌ ప్లాట్‌ విస్తీర్ణం 3.6 ఎకరాలు.


ఈ ప్లాట్‌కు రూ.362.70 కోట్లను వ్యయం చేసి రాజపుష్ప ప్రాపర్టీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది. కోకాపేట నియోపోలిస్‌ లే అవుట్‌లో స్థలాలను కొనుగోలు చేస్తే తమ ఇమేజ్‌ పెరుగుతుందని దిగ్గజ స్థిరాస్తి సంస్థలు భావించడమే ఈ పోటీకి కారణం. పలు సంస్థలు చివరిదాకా వేలంలో పాల్గొని పోటీలో పాల్గొనడంతో ధర అమాంతం పెరిగిపోయింది. దీంతో కొన్ని సంస్థలు వెనుకంజ వేశారు. అలాగే.. ఈసారి కొత్తగా మూడు రియల్‌ఎస్టేట్‌ సంస్థలు ఇక్కడ స్థలాలను దక్కించుకున్నాయి. మొత్తం 45.33 ఎకరాలకుగాను రూ.2 వేల కోట్ల దాకా వేలంలో వస్తుందని భావించిన అధికారులు.. అంతకు మించి.. రూ.3,319.6 కోట్ల ఆదాయం రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోకాపేటలో గత ఏడాది జూలై 15న హెచ్‌ఎండీఏ 49.94ఎకరాలు విక్రయిస్తే రూ.2వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి కేవలం 45 ఎకరాలకే రూ.3319 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పట్లో అత్యధికంగా ఎకరం ధర రూ.60.20 కోట్లు, అత్యల్పంగా రూ.31.20 కోట్లు పలికింది. అప్పటి వేలంలో భూములను పూర్తిగా రాష్ట్రానికి చెందిన పలు డెవల్‌పమెంట్‌ సంస్థలే పోటీపడి దక్కించుకున్నాయి. ఈసారి ఇతర రాష్ట్రాల కంపెనీలు కూడా భూములు దక్కించుకున్నాయి. బెంగుళూరు చెందిన బ్రిగేడ్‌ సంస్థ 9.71ఎకరాల విస్తీర్ణం ఉన్న 8వ నంబర్‌ ప్లాట్లను దక్కించుంది.


10వ నంబర్‌ ప్లాట్‌ను అత్యధిక ధరకు దక్కించుకున్న రాజపుష్ప సంస్థ.. 6.55ఎకరాల విస్తీర్ణంలోని 7వ నంబర్‌ ప్లాట్‌ను కూడా కొనుగోలు చేసింది. ఈ రెండు ప్లాట్ల కొనుగోలులో జాయింట్‌ వెంచర్‌తో రాజపుష్ప వచ్చింది. గతంలో సత్యనారాయణరెడ్డి మన్నె ఈ-వేలంలో మొదటి ప్లాట్‌కు బోణీ కొట్టగా, ఈసారి కూడా ఆయనకు చెందిన ఎంఎ్‌సఎన్‌ ఫార్మకెం సంస్థే బోణీ కొట్టి ఏడు ఎకరాల విస్తీర్ణంలోని ఆరో నెంబర్‌ ప్లాట్‌ను దక్కించుకోవడం గమనార్హం. ఈ ప్లాట్లను కొనుగోలు చేసిన సంస్థలు కానీ, వ్యక్తులు కానీ డిపాజిట్‌ సొమ్ము రూ.5కోట్లు మినహాయించి స్థల ఖరీదు మొత్తంలో కనీసం 33 శాతం ఏడు రోజుల్లో చెల్లించాలి. రెండో విడతగా మరో 30 రోజుల్లో స్థల ఖరీదు మొత్తంలో 33శాతం చెల్లించాలి. చివరి విడతగా 90 రోజుల్లో డిపాజిట్‌ సొమ్ము రూ.5కోట్లు కలుపుకొని మిగతా మొత్తాన్ని చెల్లించాలి. వారం రోజుల్లో మొదటి విడత చెల్లింపులు చేయకుంటే నోటీసులిచ్చి కొనుగోలు రద్దు చేస్తారు. డిపాజిట్‌ సొమ్ము తిరిగివ్వరు.

Updated Date - 2023-08-04T04:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising