KTR: 2014లో హైదరాబాద్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలావుంది?..
ABN, First Publish Date - 2023-07-05T15:12:44+05:30
హైదరాబాద్: ప్రతీ ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేయడం ఆనవాయితిగా పెట్టుకున్నామని, బుధవారం తొమ్మిది సంవత్సరాల రిపోర్టును విడుదల చేశామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్: ప్రతీ ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టు (Progress Report)ను విడుదల చేయడం ఆనవాయితిగా పెట్టుకున్నామని, బుధవారం తొమ్మిది సంవత్సరాల రిపోర్టును విడుదల చేశామని మంత్రి కేటీఆర్ (Minister KTR) వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇది సమగ్రమైన నివేదికని, 2014లో హైదరాబాద్ ఎలా ఉంది? ఇప్పుడు ఎలావుందనేది చూడండన్నారు. రెండు స్కై వే (Two Sky Way)ల కోసం రక్షణ శాఖ భూములను ఇవ్వమని ఇప్పటి వరకు ఐదుగురు రక్షణ మంత్రులను అడిగామని.. ఇంతవరకు కేంద్రం స్పందించలేదని అన్నారు. దీనికోసం150 ఎకరాల భూమి అవసరమని అన్నారు. పాతబస్తీ (Old City) మెట్రో (Metro)ను ఎల్ అండ్ టి (L@T)నీ పూర్తి చేయమన్నమని, లేకపోతే తామే నిర్మిస్తామని చెప్పామన్నారు. మెట్రో కోచ్‌లను పెంచాలని ఎల్ అండ్ టిని కోరామన్నారు. మెట్రో, ఆర్టీసీ, ఆటోలు, ఉబర్ అన్నింటినీ అనుసంధానం చేస్తూ కార్డు తేవాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.
Updated Date - 2023-07-05T15:14:43+05:30 IST