ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR.. ఫ్లై ఓవర్ ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన మంత్రి కేటీఆర్

ABN, First Publish Date - 2023-06-21T17:20:07+05:30

హైదరాబాద్: ఎల్బీనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు బుధవారం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎల్బీనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు (Minister KTR) సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి (Kims Hospital)లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు.

జరిగిన ఘటన దురదృష్టకరమన్న కేటీఆర్, ఈ ప్రమాదం పట్ల పురపాలక శాఖ పూర్తిస్థాయి విచారణ చేపడుతుందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన అంశాలపై జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో ముగ్గురితో కూడిన కమిటీకి అదనంగా జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విచారణ చేయించి, ప్రమాద కారణాలను తెలుసుకుంటామన్నారు. వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వలన ప్రమాదం జరిగితే, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంత్రి కేటీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పురపాలక శాఖ అరవింద్ కుమార్, ఇతర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.

హైదరాబాద్‌, ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్డులో ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా వరకూ నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ వద్ద పిల్లర్.. పిల్లర్‌కు మధ్య ఉన్న స్లాబ్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో స్లాబ్‌పై పది మంది కార్మికులు పనులు చేస్తున్నారు. వారిలో ఇరువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించారు. కార్మికులు బీహార్, యూపీకి చెందిన వారిగా గుర్తించారు. ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పరిశీలించారు.

సాగర్ రింగ్ రోడ్‌లో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ ర్యాంప్ కూలిన విషయంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజం మాట్లాడుతూ.. రాత్రి మూడు గంటల సమయంలో ర్యాంప్ కూలడం జరిగిందని చెప్పారు. అందులో పని చేసే పదిమందికి గాయాలయ్యాయన్నారు. వారిలో ఇద్దరికీ సీరియస్ గా ఉందని వెంటనే వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ప్రమాదం జరిగిన అంశంపై ఎంక్వయిరీ చేస్తున్నామని చెప్పారు.

Updated Date - 2023-06-21T17:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising