Congress: రేవంత్ వైపు మొగ్గు చూపుతున్న అధిష్ఠానం..
ABN, First Publish Date - 2023-12-04T09:06:10+05:30
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్‌ను దాటేసిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం ఎంపికపై కసరత్తు చేస్తోంది. పార్టీ తరపున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలతో కూడిన శాసనసభాపక్షం గచ్చిబౌళిలోని ఎల్ల హోటల్‌లో సోమవారం ఉదయం 9.30 గంటలకు సమావేశం కానుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్‌ను దాటేసిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం ఎంపికపై కసరత్తు చేస్తోంది. పార్టీ తరపున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలతో కూడిన శాసనసభాపక్షం గచ్చిబౌళిలోని ఎల్ల హోటల్‌లో సోమవారం ఉదయం 9.30 గంటలకు సమావేశం కానుంది. ఈ భేటీలో సీఎం అభ్యర్థి ఎంపిక సిఎల్పీ నిర్ణయాన్ని డీకే శివకుమార్ ఏఐసీసీకి పంపించనున్నారు. అయితే అధిష్ఠానం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతోంది.
కాగా గచ్చిబౌళిలోని ఎల్ల హోటల్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకున్నారు. మరికాసేపట్లో సీఎల్పీ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. సీఏం ఎంపిక విషయంలో అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోవాలని.. ఎమ్మెల్యేలు ఏకగ్రీవ తీర్మానం చేయనున్నారు. అయితే ప్రజాదరణ కలిగిన నాయకుడిగా రేవంత్‌కి గుర్తింపు ఉంది. 88 సభల్లో పాల్గొని కాంగ్రెస్ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు.
వీలైతే సోమవారమే కాంగ్రెస్ సీఏం, డిప్యూటీ సీఏం ప్రమాణ స్వీకారం చేయించాలని అధిష్టానం భావిస్తోంది. ఈరోజు రాత్రి ఎనిమిది గంటల వరకు సప్తమి ఉన్నందున మంచిరోజు కావడంతో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. లేదంటే ఈనెల 6న ప్రమాణస్వీకారం చేస్తారు. డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం చేస్తే గ్రాండ్‌గా ఉంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే గవర్నర్ తమిళిసైను కాంగ్రెస్ నాయకులు కోరారు.
Updated Date - 2023-12-04T09:06:23+05:30 IST