ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hyderabad: కాంగ్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వామపక్షాలు

ABN, First Publish Date - 2023-08-28T10:12:45+05:30

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీల మధ్య స్నేహం చిగురిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ అదిష్టానం, ఇటు వామపక్షాల జాతీయ నాయకత్వాల చోరవతో ఎన్నికల పొత్తుకు సానుకూల వాతావరణం ఏర్పడినట్లు సమాచారం.

హైదరాబాద్: ఎన్నికలు (Elections) సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ (Telangana)లో రాజకీయ సమీకరణాలు (Political Equations) వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress), సీపీఐ (CPI), సీపీఎం (CPM) పార్టీల మధ్య స్నేహం (Friendship) చిగురిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ అదిష్టానం, ఇటు వామపక్షాల జాతీయ నాయకత్వాల చోరవతో ఎన్నికల పొత్తుకు సానుకూల వాతావరణం ఏర్పడినట్లు సమాచారం. ఎన్నికల పొత్తుకు సంబంధించి సీపీఐ నేతల అభిప్రాయం తీసుకునేందుకు ఓ మధ్యవర్తి ఆదివారం ఆ పార్టీ నేతలను ఆహ్వానించారు. రహస్యంగా జరిగిన ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు, చాడ వెంకటరెడ్డి, చల్లా వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల పొత్తుప్రతిపాదనలపై కొంత సానుకూలత వ్యక్తం చేసిన వారు.. సీట్ల సర్దుబాట్ల విషయంలో సాగదీత తగదని స్పష్టం చేసినట్లు సమాచారం.

ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ నిర్దిష్ట ప్రణాళికతో రావాలని, ఒకటి రెండు బేటీల్లో సీట్ల సర్దుబాటు విషయం తేలిపోవాలని చెప్పినట్లు సమాచారం. తుది నిర్ణయం ఏదైనా సీపీఎం రాష్ట్ర నాయక్వాన్ని కూడా సంప్రదించాకే ఉంటుందని వామపక్ష నేతలు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సీపీఎం సయితం కాంగ్రెస్ పార్టీ నుంచి నిర్ధిష్ట ప్రతిపాదన వచ్చినప్పుడే సీట్ల సర్దుబాట్లపై చర్చలు ప్రారంభించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Updated Date - 2023-08-28T10:12:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising