Mahesh Kumar Goud: మహిళా బిల్లుపై కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-09-19T15:13:56+05:30
మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)కు కేబినెట్ ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)కు కేబినెట్ ఆమోదం తెలపడంపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మహిళా బిల్లు కాంగ్రెస్(Congress) మానస పుత్రిక.మహిళా బిల్లును కాంగ్రెస్ స్వాగతిస్తోంది. కేసీఆర్ కేబినెట్(KCR Cabinet)లో ఒక్క మహిళ లేరని తండ్రిని అడగలేని ధైర్యం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla kavitha)ది. కవిత ఎక్కడ ఉద్యమం చేసింది.. పోరాటం చేసింది ??నమ్ముకుంటే పోతే చంద్రయాన్ రాకెట్ నేనే చేసిన అని కూడా కవిత చెప్పింది. ప్రపంచంలో అవినీతి సామ్రాట్ కేసీఆర్.అతి తక్కువ సమయంలో అతి ఎక్కువ దోచుకున్నది కేసీఆర్ ప్రభుత్వం.2004కు ముందు కేసీఆర్, కవిత, హరీష్‌రావు ఆస్తులు ఎంత... ??బీజేపీ(bjp)కి దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణలో బినామీ చట్టాన్ని అమలు చేయాలి భారత్ నిర్మాణంలో నెహ్రూ దూరదృష్టి అమోఘం.స్వాతంత్ర్య, తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేని బీజేపీ నాయకులు ఈ రోజు ఈ అంశంపై మాట్లాడుతున్నారు.
నెహ్రూ, పటేల్ మైత్రి, నిర్ణయాలు సమష్టిగా చేశారు. దేశ హోంమంత్రి అమిత్‌షా చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయడం దురదృష్టకరం.బ్రిటిష్ వారి నీతీని బీజేపీ అనుసరిస్తోంది.ప్రజలను విడదీసి పాలించే ప్రయత్నం చేస్తోంది.పటేల్ ప్రజా నాయకుడు.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు..గుండు సూది తయారుకాని దశ నుంచి రాకెట్ పంపించే స్థాయి వరకు భారత్ ఎదగడం వెనుక నెహ్రూ, గాంధీ కుటుంబం త్యాగం ఉంది.1981లో పుట్టిన బీజేపీకి మాట్లాడే అర్హత .కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం. విజయభేరి సభ విజయం చూసి బీజేపీ, బీఆర్ఎస్‌లకు భయం వేస్తోంది.బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో ఏ మంత్రికి స్వేచ్ఛ లేదు.రజాకార్ ఫైల్స్‌తో ఏమి చేసుకుంటారు ?. రజాకార్లు, నిజాం వ్యతిరేక పోరాటంలో ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ లేదు. తెలంగాణ ప్రజలు తెలివైన వారు.. ఎన్ని రెచ్చగొట్టే సినిమాలు తీసినా.. శాంతిభద్రతలను దెబ్బతీయలేరు’’ అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
Updated Date - 2023-09-19T15:13:56+05:30 IST