ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP: బీజేపీలో చేరిన ఆదిలాబాద్ ముఖ్య నేతలు

ABN, First Publish Date - 2023-07-31T10:12:43+05:30

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో చేరికలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి అనేక మంది కమలం పార్టీలో చేరుతుండగా.. తాజాగా ఆదిలాబాద్ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు సంజీవరావు, శ్రీదేవి కాషాయికండువా కప్పుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీలో చేరికలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి అనేక మంది కమలం పార్టీలో చేరుతుండగా.. తాజాగా ఆదిలాబాద్ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు సంజీవరావు, శ్రీదేవి (Former MLAs Sanjeevrao, Sridevi) కాషాయికండువా కప్పుకున్నారు. సోమవారం ఉదయం చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి బీజేపీలో చేరారు. ఇరువురు నేతలకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీకే అరుణ (DK Aruna), ఈటల రాజేందర్ (Etela Rajender), వివేక్ (Vivek), బూర నర్సయ్య గౌడ్ (Bura narsaiah Goud), మహేశ్వరరెడ్డి (Maheshwar Reddy) తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సీనియర్లు సంజీవరావు, శ్రీదేవి సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని తెలిపారు. సమిష్టి నాయకత్వంతో బీఆర్ఎస్ (BRS) ఓడించి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలను ఆదుకోవటంలో కేసీఆర్ సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.900 కోట్ల‌ పైచిలుకు కేంద్రం నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరున్నాయన్నారు. నేటి నుంచి కేంద్ర బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తాయని తెలిపారు. అతి తక్కువ సమయంలో కేంద్ర బృందాన్ని మోదీ (PM Narendra Modi), షా (Amit shah) లు తెలంగాణకు పంపించారని తెలిపారు. గిరిజన రిజర్వేషన్లపై ఎంపీ‌ సోయం బాపూరావు (MP Soyam Bapu Rao)కామెంట్స్ ఆయన వ్యకగతమని చెప్పుకొచ్చారు. సోయం బాపూరావు వ్యాఖ్యలతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. సోయం బాపూరావు వ్యాఖ్యలపై పార్టీ వివరణ కోరుతోందన్నారు.

లంబాడీలకు రిజిస్ట్రేషన్ల‌పై బీజేపీ కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. అధికారంలోకి రాగానే లంబాడీలకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. తొమ్మిదేళ్ళ బీఆర్ఎస్ పాలనలో గిరిజనులకు అన్యాయం జరిగిందన్నారు. జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సర్కార్ గిరిజన వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్, ఎంఐఎంలు (MIM) కలసి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాయన్నారు. సోనియా గాంధీ, కల్వకుంట్ల కుటుంబం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పనిచేస్తున్నాయని విమర్శించారు. దేశం, ప్రజల కంటే ఆ పార్టీలు కుటుంబానికే ప్రాధాన్యతనిస్తాయన్నారు. ప్రజాధనాన్ని దోచుకున్న చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒకే తాను ముక్కలన్నారు. పొత్తులతో పాటు.. ప్రభుత్వంలో కలసి పనిచేసిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-07-31T10:12:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising