Gaddar: ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతిపై మావోయిస్ట్ పార్టీ సంతాపం
ABN, First Publish Date - 2023-08-07T17:03:30+05:30
ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతిపై మావోయిస్ట్ పార్టీ సంతాపం తెలిపింది. ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు.
హైదరాబాద్: ప్రజా యుద్ధ నౌక గద్దర్ మృతిపై మావోయిస్ట్ పార్టీ సంతాపం తెలిపింది. ఈ మేరకు భారత కమ్యూనిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేశారు.
లేఖలో ఏముంది అంటే..
‘‘గద్దర్ మరణం రాష్ట్ర ప్రజలందరికీ ఆవేదనను కలిగించింది. గద్దర్ అంటే దేశంలో, రాష్ట్రంలో తెలియని వారు ఉండరు. గద్దర్ మరణం మమ్మల్ని తీవ్రంగా బాధకు గురి చేసింది. గద్దర్‌కు మా ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాం. పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వాము వ్యతిరేకంగా పోరాటం చేశారు. పాటలు, నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను చైతన్య పరిచారు. జన నాట్య మండలి ఏర్పాటులో గద్దర్ కృషి ఉంది. 1972 నుంచి గద్దర్ విప్లవ ప్రస్థానం మొదలై 2012 వరకూ కొనసాగింది. 4 దశబ్దాలు పీడిత ప్రజల ప్రక్షాన నిలబడ్డారు. 1972 నుంచి 2012 మావోయిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగారు. మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా పని చేశారు. దోపిడీ పాలకులు ఎన్‌కౌంటర్‌లో, బూటకపు ఎన్‌కౌంటర్లలో మరణించిన విప్లవకారుల శవాలను తమ కుటుంబాలకు చేరకుండా చేసిన సందర్భంలో శవాల స్వాధీన ఉద్యమానికి నాయకత్వం వహించారు. 2012 వరకు పీడిత ప్రజల పక్షాన నిలిచిన గద్దర్ ఆ తర్వాత బూర్జువా పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నారు.’’ అని లేఖలో మావోలు గుర్తుచేశారు.
Updated Date - 2023-08-07T17:03:30+05:30 IST