Harish Rao: నినాదాలు నిజం చేసే పార్టీ బీఆర్ఎస్
ABN, First Publish Date - 2023-08-31T11:50:47+05:30
హైదరాబాద్: మంత్రి హరీష్ రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు సమక్షంలో ఎంఆర్పీఎస్ నేత యాతాకుల భాస్కర్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ నినాదాలు ఇచ్చే పార్టీలు కొన్ని ఉంటాయని...
హైదరాబాద్: మంత్రి హరీష్ రావు (Minister Harish Rao), ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageswararao) సమక్షంలో ఎంఆర్పీఎస్ నేత యాతాకుల భాస్కర్ (Yatakula Bhaskar) బీఆర్ఎస్ (BRS) కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ నినాదాలు ఇచ్చే పార్టీలు కొన్ని ఉంటాయని, నినాదాలు నిజం చేసే పార్టీ బీఆర్ఎస్ అని, బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) పార్టీలు నకిలీ, వెకిలి హామీలు ఇస్తున్నాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ (CM KCR)ను విమర్శించే ముందు ఆయా ప్రభుత్వాలు ఇంత కన్నా మంచి చేసి ఉండాలన్నారు.
ఖర్గే (Kharge), అమిత్ షా (Amit Shah)లు టూరిస్టులా వచ్చి వెళ్లారని, బీజేపీ లోకల్ లీడర్స్ ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివారని హరీష్ రావు అన్నారు. అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లో పగలు కూడా కరెంట్ ఉండట్లేదని ఎద్దేవా చేశారు. అక్కడి గుడ్డి పాలనను సరి చేయడం కుదరదు గానీ... ఇక్కడ డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలో అలవి కాని హామీలు ఇచ్చి చతికిల బడ్డారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు నకిలీ, వెకిలీ హామీలు ఇస్తున్నాయన్నారు. నకిలీ డిక్లరేషన్‌లు ఇస్తే ఇక్కడి ప్రజలు నమ్మరన్నారు. కర్ణాటకలో బీజేపీపై వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్‌కు అవకాశం వచ్చిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
Updated Date - 2023-08-31T11:50:47+05:30 IST