ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KTR: తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ... పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కేటీఆర్

ABN, First Publish Date - 2023-09-16T10:03:08+05:30

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఈరోజు(శనివారం) ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును (palamuru Rangareddy Project) సీఎం కేసీఆర్ (CM KCR) ఈరోజు(శనివారం) ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్విట్టర్ వేదికగా తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘తరతరాల ఎదురు చూపులు ఫలించే వేళ .. పల్లేర్లు మొలిచిన పాలమూరులో పాలనురగల జలహేల!. వలసల వలపోతల గడ్డపైన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ఆవిష్కృతం! కరువు కరాళ నృత్యం చేసిన భూముల్లో కృష్ణమ్మ జల తాండవం! శెలిమలే దిక్కైన కాడ ఉద్దండ జలాశయాలు..! బాయిమీద పంపుసెట్లు నడవని చోట బాహుబలి మోటర్లు ..! స్వరాష్ట్ర ప్రస్థానంలో సగర్వ సాగునీటి సన్నివేశం..! ఆరు జిల్లాలు సస్యశ్యామలం దక్షిణ తెలంగాణకు దర్జాగా జలాభిషేకం! నిన్న..పరాయి నేలపైన ప్రాజెక్టులకు రాళ్ళెత్తిన పాలమూరు లేబర్ ! నేడు..సొంత భూమిలో ప్రాజెక్టుల కింద రతనాలు పండిస్తున్న ఫార్మర్..! నాడు ..నది పక్కన నేల ఎడారిలా ..ఎండిన విషాదం ! సమైక్య పాలకుల పాపం.. కాంగ్రెసోళ్ల శాపం! బిర బిరా తరలి వెళ్తున్న కృష్ణమ్మను బీడు భూములకు రప్పించేందుకు స్వయం పాలనలో సాహస యజ్ఞం! ఆటంకాలు అవరోధాలు అధిగమించి ప్రతి పక్షాల కుట్రలు కేసులు ఛేదించి సవాల్ చేసి సాధించిన విజయం! నీటి వాటా తేల్చకుండా నిర్లక్ష్యం అనుమతుల్లో అంతులేని జాప్యం. ఐనా.. కేంద్ర సర్కారు కక్షను వివక్షను దీక్షతో గెలిచిన దృఢ సంకల్పం! తీరిన దశాబ్దాల నీటి వెత తెచ్చుకున్న తెలంగాణకు ఇదే సార్థకత..!’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Updated Date - 2023-09-16T10:30:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising