ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Sabita: సాత్విక్‌ ఆత్మహత్యపై సమగ్ర విచారణకు మంత్రి సబిత ఆదేశం

ABN, First Publish Date - 2023-03-01T12:11:48+05:30

నగరంలోని నార్సింగి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: నగరంలోని నార్సింగి కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indra Reddy) ఆరా తీశారు. విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవాలని, పోలీసులు తమ దర్యాప్తును కొనసాగించాలని స్పష్టం చేశారు. వీలైనంత తొందరగా విచారణ నివేదిక అందించాలని ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌ (IAS Naveen Mittal) కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Telangana Minister) ఆదేశాలు జారీ చేశారు.

కాలేజ్‌ వద్ద తల్లిదండ్రుల ధర్నా...

నగరంలోని నార్సింగిలో ఓ కార్పొరేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న సాత్విక్ (Inter Student Satvik) అనే ఇంటర్ స్టూడెంట్ కళాశాలలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒత్తిడి వల్లే సాత్విక్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్ తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ సిబ్బంది తీరుపై సాత్విక్ తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కాలేజీ సిబ్బంది తీరువల్లే సాత్విక్‌ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్ తల్లిదండ్రుల ధర్నాకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో నార్సింగ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

విద్యార్థి సంఘాల అరెస్ట్...

సాత్విక్ మృతికి నిరసనగా విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగారు. సాత్విక్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని పట్టుబట్టారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థి సంఘాలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మృతుడి తల్లిదండ్రులు కాలేజీ ముందే బైఠాయించి న్యాయం కోసం నిరీక్షిస్తున్నారు.

భారీ బందోబస్తు...

కాగా... నార్సింగ్ కార్పొరేట్ కళాశాల ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. కాలేజీ ముందు ఆందోళనల రీత్యా ముందస్తు భద్రతను ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-03-01T12:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!