ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Minister Talasani: ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా జరిగిన ఘటనపై మంత్రి తలసాని క్లారిటీ

ABN, First Publish Date - 2023-08-25T10:57:57+05:30

ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా ఓ వ్యక్తిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోసేయడం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తలసాని నేడు క్లారిటీ ఇచ్చారు. ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్‌కి మంత్రి కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందన్నారు.

హైదరాబాద్ : ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా ఓ వ్యక్తిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోసేయడం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తలసాని నేడు క్లారిటీ ఇచ్చారు. ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్‌కి మంత్రి కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తన కాలు తొక్కుతూ ముందుకెళ్లాడన్నారు. దీంతో తన కాలికి గాయమై రక్తమొచ్చిందన్నారు. ఆ సందర్భంగానే ఆ వ్యక్తిని నెట్టి వేశానని తలసాని తెలిపారు. సోషల్ మీడియాలో దీన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారన్నారు.

ఇక తను తోసేసిన వ్యక్తి బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్ బాబు అని తెలిసిందని తలసాని తెలిపారు. ఆయన గిరిజన బిడ్డా అని తెలిసిందని వెంటనే ఆయనకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పానన్నారు. దీనిపై కావాలనే తనపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారు. తాను బడుగు, బలహీన, దళిత, మైనార్టీ గిరిజన వర్గాల గొంతుకనని తలసాని అన్నారు. తెలంగాణలో జరిగే సేవాలాల్, కొమురం భీం జయంతి కార్యక్రమాలు ముందుండి చేస్తానన్నారు. ఆ రోజు జరిగిన ఘటనపై వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే మరోసారి క్షమాపణ చెబుతున్నానని తలసాని పేర్కొన్నారు.

Updated Date - 2023-08-25T10:57:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising