Talasani.. రేపు ఉదయం వరకు నిమజ్జనం కొనసాగుతుంది: మంత్రి తలసాని
ABN, First Publish Date - 2023-09-28T11:52:59+05:30
హైదరాబాద్: గణేష్ విగ్రహాల నిమజ్జనం సాఫీగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, నిమజ్జన కార్యక్రమం సవ్యంగా సాగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఈ నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన గురువారం చార్మినార్ వద్ద మీడియాతో మాట్లాడుతూ..
హైదరాబాద్: గణేష్ విగ్రహాల నిమజ్జనం (Immersion of Ganesh Idols) సాఫీగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, నిమజ్జన కార్యక్రమం సవ్యంగా సాగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. ఈ నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన గురువారం చార్మినార్ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్ని షెడ్యూల్ ప్రకారమే నిమజ్జనం చేస్తున్నామన్నారు. బాలాపూర్ గణనాథుడు మధ్యాహ్నం వరకు చార్మినార్‌కు చేరుకునే అవకాశం ఉందని, రేపు (శుక్రవారం) ఉదయం వరకు నిమజ్జనం కొనసాగుతుందని చెప్పారు. నిమజ్జన సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, వినాయక నిమజ్జనం చూడడానికి లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుకు తగినట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. వినాయక శోభాయాత్రను సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిరక్షిస్తున్నామన్నారు. గణనాథులను త్వరగా నిమజ్జనం అయ్యేలా చూడడం తమ ఉద్దేశం కాదని.. ఎవరు ఎప్పుడు వచ్చినా నిమజ్జనం చేసుకోవచ్చునని మంత్రి తలసాని స్పష్టం చేశారు.
Updated Date - 2023-09-28T11:52:59+05:30 IST