ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Talasani: ప్రతీ పనికిమాలినోడు డబుల్ బెడ్ రూమ్‌లపై మాట్లాడుతాడు.. తలసాని ఫైర్

ABN, First Publish Date - 2023-05-18T12:37:29+05:30

జూబ్లీహిల్స్ కమలానగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం ఉదయం ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జూబ్లీహిల్స్ కమలానగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav), ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (MLA Maganti Gopinath) గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ... ‘‘ప్రతి పనికిమాలినోడు ఇల్లు ఎక్కడ కట్టారని విమర్శలు చేస్తున్నాడు.. వాడికి కళ్ళు కనిపిస్తలేనట్లు ఉన్నాయి.. 58 జీవో ప్రకారం పేదవారి ఇల్లు రెగ్యులరైజ్ చేసినం.. పెన్షన్‌లు ఇస్తున్నాం, డబల్ బెడ్ రూంలు కట్టి ఇస్తున్నాం, షాది ముబరక్, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు. 126 గుడిసెలను తొలగించి 210 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించామన్నారు. ఇవి పప్పు, బెల్లంలాగా ఎవరికి పడితే వారికి పంచడానికి ఉండదని తెలిపారు. గతంలో ఒక్కో ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి లక్షన్నర అయ్యేదని.. ఇప్పుడు ఒక్కో డబల్ బెడ్ రూం ఇల్లు నిర్మించడానికి 9 లక్షల రూపాయల ఖర్చు అవుతోందని చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరూ చాలా మాట్లాడుతున్నారని... కానీ పేదల కోసం ఏమీ చేయరని విమర్శించారు. అందరికీ ఇల్లు ఇస్తామని.. ఎవరు భయపడవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.

తలసాని ఆగ్రహం..

అయితే కార్యక్రమంలో భాగంగా ఓ మహిళపై మంత్రి తలసాని సీరియస్ అయ్యారు. తనకు ఇల్లు కావాలని సదరు మహిళ మంత్రి కోరింది. అయితే సమాధానం చెప్పాల్సిన మంత్రి... ఇల్లు కావాలని అడుగుతున్న మాహిళపై మండిపడ్డారు. దేశంలో ఎవరైనా ఇలాంటి ఇల్లు కట్టారా అంటూ తిరిగి ఆ మహిళనే మంత్రి ప్రశ్నించారు.

Updated Date - 2023-05-18T12:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising