ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Talasani Srinivasyadav: మా జోలికి వస్తే... కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని ఫైర్

ABN, First Publish Date - 2023-07-19T15:20:10+05:30

కాంగ్రెస్ నేతలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలపై (Congress Leaders) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas) ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... బీసీ నాయకులపై కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తమ ఆత్మ గౌరవం దెబ్బ తినేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు జోలికి వస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇకపై కాంగ్రెస్ నేతలు తమపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తే తాము మూకుమ్మడిగా దాడి చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలను ఘోరంగా అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను అవమానించటం కాంగ్రెస్ విధానమా అని ప్రశ్నించారు. బీసీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులకు ఇక తమ తడఖా చూపిస్తామన్నారు. బీసీ వర్గాలను ఏకం చేసి.. వ్యక్తిగతమైన విమర్శలు చేసిన వారిని తమిరికొడుతామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనకు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. బీసీల జోలికి వస్తే... కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తదన్నారు. త్వరలో బీసీల బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని.. సభ ద్వారా కాంగ్రెస్ బీసీ నేతలను అవమానిస్తోన్న తీరును ప్రజలకు వివరిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-07-19T15:27:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising